Bible

Leviticus 13 - DBY (Telugu)

1 And Jehovah spoke to Moses and to Aaron, saying,మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.

2 When a man shall have in the skin of his flesh a rising or a scab, or bright spot, and it become in the skin of his flesh a sore [as] of leprosy, then he shall be brought unto Aaron the priest, or unto one of his sons the priests.ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మ మందు కుష్ఠుపొడవంటిది కనబడిన యెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజ కులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను.

3 And when the priest looketh on the sore in the skin of the flesh, and the hair in the sore is turned white, and the sore looketh deeper than the skin of his flesh, it is the sore of leprosy; and the priest shall look on him and pronounce him unclean.ఆ యాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.

4 But if the bright spot be white in the skin of his flesh, and look not deeper than the skin, and the hair thereof be not turned white, the priest shall shut up [him that hath] the sore seven days.నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.

5 And the priest shall look on him the seventh day; and behold, in his sight, the sore remaineth as it was, the sore hath not spread in the skin, then the priest shall shut him up seven days a second time.​ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.

6 And the priest shall look on him again the seventh day, and behold, the sore is become pale and the sore hath not spread in the skin, then the priest shall pronounce him clean; it is a scab; and he shall wash his garments and be clean.ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

7 But if the scab have spread much in the skin, after that he hath been seen by the priest for his cleansing, he shall be seen by the priest again;అయితే వాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.

8 and the priest shall look on him, and behold, the scab hath spread in the skin; then the priest shall pronounce him unclean: it is leprosy.అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజ కుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.

9 When a sore [as] of leprosy is in a man, he shall be brought unto the priest;కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.

10 and the priest shall look on him, and behold, there is a white rising in the skin, and it hath turned the hair white, and a trace of raw flesh is in the rising:యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుక లను తెల్లబారినయెడలను, వాపులో పచ్చి మాంసము కన బడినయెడలను,

11 it is an old leprosy in the skin of his flesh; and the priest shall pronounce him unclean, and he shall not shut him up, for he is unclean.అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు; వాడు అప విత్రుడు.

12 But if the leprosy break out much in the skin, and the leprosy cover all the skin of [him that hath] the sore, from his head even to his foot, wherever the eyes of the priest look,కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలు కొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల

13 and the priest looketh, and behold, the leprosy covereth all his flesh, he shall pronounce [him] clean [that hath] the sore; it is all turned white; he is clean.యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను; వాడు పవిత్రుడు.

14 And on the day when raw flesh appeareth in him, he shall be unclean.అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు.

15 And the priest shall look on the raw flesh, and shall pronounce him unclean: the raw flesh is unclean, it is leprosy.యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.

16 But if the raw flesh change again, and be turned white, he shall come unto the priest;​అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారిన యెడల వాడు యాజకునియొద్దకు రావలెను;

17 and the priest shall look on him, and behold, the sore is turned white; then the priest shall pronounce [him] clean [that hath] the sore: he is clean.యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను; వాడు పవిత్రుడు.

18 And the flesh -- when in the skin thereof cometh a boil, and it is healed,ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత

19 and there is in the place of the boil a white rising, or a white-reddish bright spot, it shall be shewn to the priest;ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దానికనుపరచవలెను.

20 and the priest shall look on it, and behold, it looketh deeper than the skin, and the hair thereof is turned white; then the priest shall pronounce him unclean: it is the sore of leprosy broken out in the boil.యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.

21 But if the priest look on it, and behold, there are no white hairs therein, and it is not deeper than the skin, and is pale, the priest shall shut him up seven days;యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కన బడినయెడ లను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.

22 and if it spread much in the skin, then the priest shall pronounce him unclean: it is the sore.అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.

23 But if the bright spot have remained in its place, [and] have not spread, it is the scar of the boil; and the priest shall pronounce him clean.నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడు వాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.

24 Or if in the flesh, in the skin thereof, there is a burning inflammation, and the place of the inflammation become a bright spot white-reddish or white,దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానే గాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.

25 and the priest look on it, and behold, the hair is turned white in the bright spot, and it looketh deeper than the skin, it is a leprosy which is broken out in the inflammation; and the priest shall pronounce him unclean: it is the sore of leprosy.నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.

26 But if the priest look on it, and behold, there is no white hair in the bright spot, and it is no deeper than the skin, and is pale, the priest shall shut him up seven days.యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.

27 And the priest shall look on him the seventh day, and if it have spread much in the skin, the priest shall pronounce him unclean: it is the sore of leprosy.ఏడవనాడు యాజ కుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.

28 But if the bright spot have remained in its place, [and] not spread in the skin, and is pale, it is the rising of the inflammation; and the priest shall pronounce him clean; for it is the scar of the inflammation.అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే; వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.

29 And if a man or a woman have a sore on the head or on the beard,పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా

30 and the priest look on the sore, and behold, it looketh deeper than the skin, and there is in it yellow thin hair, then the priest shall pronounce him unclean; it is a scall, the leprosy of the head or the beard.అది చర్మముకంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడిన యెడల, వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము.

31 And if the priest look on the sore of the scall, and behold, it is not in sight deeper than the skin, and there is no black hair in it, the priest shall shut up [him that hath] the sore of the scall seven days.యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచి నప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేని యెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

32 And when the priest looketh on the sore on the seventh day, and behold, the scall hath not spread, and there is in it no yellow hair, and the scall doth not look deeper than the skin,ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,

33 he [that hath the sore] shall shave himself; but the scall shall he not shave; and the priest shall shut up [him that hath] the scall seven days a second time.వాడు క్షౌరము చేసికొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

34 And the priest shall look on the scall on the seventh day, and behold, the scall hath not spread in the skin, nor is in sight deeper than the skin, then the priest shall pronounce him clean; and he shall wash his garments, and be clean.ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లము కాక యుండినయెడల, యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.

35 But if the scall have spread much in the skin after his cleansing,వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన యెడల యాజకుడు వాని చూడవలెను,

36 and the priest shall look on him, and behold, the scall hath spread in the skin, the priest shall not seek for yellow hair: he is unclean.అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు; వాడు అపవిత్రుడు.

37 But if the scall have in his sight remained as it was, and there is black hair grown up therein, the scall is healed: he is clean; and the priest shall pronounce him clean.అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టిన యెడల ఆ మాద బాగుపడెను; వాడు పవిత్రుడు; యాజ కుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.

38 And if a man or a woman have in the skin of their flesh bright spots, white bright spots,మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల

39 and the priest look, and behold, there are in the skin of their flesh pale white spots, it is an eruption which is broken out in the skin: he is clean.యాజకుడు వానిని చూడ వలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు; వాడు పవిత్రుడు.

40 And if a man's hair have fallen off his head, he is bald: he is clean;తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయి నను వాడు పవిత్రుడు.

41 and if he have the hair fallen off from the part of the head towards his face, he is forehead-bald: he is clean.​ముఖమువైపున తల వెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు; వాడు పవిత్రుడు.

42 And if there be in the bald head, or bald forehead, a white-reddish sore, it is a leprosy which hath broken out in his bald head, or his bald forehead.అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టిన యెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటి యందైనను పుట్టిన కుష్ఠము.

43 And the priest shall look on it, and behold, the rising of the sore is white-reddish in his bald head, or in his bald forehead, like the appearance of the leprosy in the skin of the flesh;యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మ మందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల

44 he is a leprous man, he is unclean; the priest shall pronounce him utterly unclean; his sore is in his head.వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు; యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.

45 And as to the leper in whom the sore is, -- his garments shall be rent, and his head shall be uncovered, and he shall put a covering on his beard, and shall cry, Unclean, unclean!ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.

46 All the days that the sore shall be in him he shall be unclean: he is unclean; he shall dwell apart; outside the camp shall his dwelling be.ఆ పొడ వానికి కలిగిన దినములన్నియు వాడు అపవిత్రుడై యుండును; వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

47 And if a sore of leprosy is in a garment, in a woollen garment, or a linen garment,మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

48 either in the warp or in the woof of linen or of wool, or in a skin, or in anything made of skin,నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునం దేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి

49 and the sore is greenish or reddish in the garment, or in the skin, or in the warp, or in the woof, or in anything of skin, it is the sore of leprosy, and shall be shewn unto the priest.ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళు గానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కను పరచవలెను.

50 And the priest shall look on the sore, and shall shut up [that which hath] the sore seven days.యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.

51 And he shall see the sore on the seventh day: if the sore have spread in the garment, either in the warp or in the woof, or in a skin, in any work that may be made of skin, the sore is a corroding leprosy: it is unclean.ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అప విత్రము.

52 And they shall burn the garment, or the warp or the woof, of wool or of linen, or anything of skin, wherein the sore is; for it is a corroding leprosy: it shall be burned with fire.​కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడు గును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.

53 But if the priest look, and behold, the sore hath not spread in the garment, or in the warp, or in the woof, or in anything of skin,​అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపిం పక పోయినయెడల

54 then the priest shall command that they wash the thing wherein the sore is, and he shall shut it up seven days a second time.​యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచ వలెను.

55 And the priest shall look on the sore after the washing, and behold, if the sore have not changed its appearance, and the sore have not spread, it is unclean: thou shalt burn it with fire: it is a fretting sore on what is threadbare or where the nap is gone.ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.

56 But if the priest look, and behold, the sore hath become pale after the washing of it, then he shall rend it from the garment, or from the skin, or from the warp, or from the woof.యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.

57 And if it appear still in the garment, or in the warp, or in the woof, or in anything of skin, it is a [leprosy] breaking out: thou shalt burn with fire that wherein the sore is.అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరు కుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.

58 But the garment, or the warp, or the woof, or whatever thing of skin which thou hast washed, and the sore departeth from them, it shall be washed a second time, and it is clean.ఏ వస్త్రమునేగాని పడు గునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉది కినతరువాత ఆ పొడ వదిలిన యెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;

59 This is the law of the sore of leprosy in a garment of wool or linen, or in the warp, or in the woof, or in anything of skin, to cleanse it, or to pronounce it unclean.అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేక యందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి యిదే.

Telugu Bible