Leviticus 1 - DBY (Telugu)
1 And Jehovah called to Moses and spoke to him out of the tent of meeting, saying,యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
2 Speak unto the children of Israel and say unto them, When any man of you presenteth an offering to Jehovah, ye shall present your offering of the cattle, of the herd and of the flock.నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను.
3 If his offering be a burnt-offering of the herd, he shall present it a male without blemish: at the entrance of the tent of meeting shall he present it, for his acceptance before Jehovah.అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.
4 And he shall lay his hand on the head of the burnt-offering; and it shall be accepted for him to make atonement for him.అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును.
5 And he shall slaughter the bullock before Jehovah; and Aaron's sons, the priests, shall present the blood and sprinkle the blood round about on the altar that is at the entrance of the tent of meeting.అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
6 And he shall flay the burnt-offering, and cut it up into its pieces.అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత
7 And the sons of Aaron the priest shall put fire on the altar, and lay wood in order on the fire;యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.
8 and Aaron's sons, the priests, shall lay the pieces, the head, and the fat, in order on the wood that is on the fire which is on the altar;అప్పుడు యాజకులైన అహరోను కుమా రులు ఆ అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.
9 but its inwards and its legs shall he wash in water; and the priest shall burn all on the altar, a burnt-offering, an offering by fire to Jehovah of a sweet odour.అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.
10 And if his offering be of the flock, of the sheep or of the goats, for a burnt-offering, he shall present it a male without blemish.దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱలయొక్కగాని మేకలయొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి
11 And he shall slaughter it on the side of the altar northward before Jehovah; and Aaron's sons, the priests, shall sprinkle its blood on the altar round about.బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
12 And he shall cut it into its pieces, and its head, and its fat; and the priest shall lay them in order on the wood that is on the fire which is on the altar;దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.
13 but the inwards and the legs shall he wash with water; and the priest shall present [it] all, and burn [it] on the altar: it is a burnt-offering, an offering by fire to Jehovah of a sweet odour.దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.
14 And if his offering to Jehovah be a burnt-offering of fowls, then he shall present his offering of turtle-doves, or of young pigeons.అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావు రపు పిల్లలలో నుండిగాని తేవలెను.
15 And the priest shall bring it near to the altar and pinch off its head and burn it on the altar; and its blood shall be pressed out at the side of the altar.యాజకుడు బలి పీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలి పీఠము ప్రక్కను పిండవలెను.
16 And he shall remove its crop with its feathers, and cast it beside the altar on the east, into the place of the ashes;మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలి పీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.
17 and he shall split it open at its wings, [but] shall not divide [it] asunder; and the priest shall burn it on the altar on the wood that is on the fire: it is a burnt-offering, an offering by fire to Jehovah of a sweet odour.అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.
Telugu Bible