John 7 - ASV (Telugu)
1 And after these things Jesus walked in Galilee: for he would not walk in Judaea, because the Jews sought to kill him.అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకి నందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను.
2 Now the feast of the Jews, the feast of tabernacles, was at hand.యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక
3 His brethren therefore said unto him, Depart hence, and go into Judaea, that thy disciples also may behold thy works which thou doest.ఆయన సహోదరులు ఆయనను చూచినీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్లుము.
4 For no man doeth anything in secret, and himself seeketh to be known openly. If thou doest these things, manifest thyself to the world.బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కన బరచుకొనుమని చెప్పిరి.
5 For even his brethren did not believe on him.ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.
6 Jesus therefore saith unto them, My time is not yet come; but your time is always ready.యేసు నా సమయ మింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది.
7 The world cannot hate you; but me it hateth, because I testify of it, that its works are evil.లోకము మిమ్మును ద్వేషింపనేరదుగాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.
8 Go ye up unto the feast: I go not up unto this feast; because my time is not yet fulfilled.మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణముకాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్లనని వారితో చెప్పెను.
9 And having said these things unto them, he abode `still' in Galilee.ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను.
10 But when his brethren were gone up unto the feast, then went he also up, not publicly, but as it were in secret.అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను.
11 The Jews therefore sought him at the feast, and said, Where is he?పండుగలో యూదులుఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి.
12 And there was much murmuring among the multitudes concerning him: some said, He is a good man; others said, Not so, but he leadeth the multitude astray.మరియు జనసమూహము లలో ఆయననుగూర్చి గొప్ప సణుగు పుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరుకాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి;
13 Yet no man spake openly of him for fear of the Jews.అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు.
14 But when it was now the midst of the feast Jesus went up into the temple, and taught.సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను.
15 The Jews therefore marvelled, saying, How knoweth this man letters, having never learned?యూదులు అందుకు ఆశ్చర్య పడిచదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి.
16 Jesus therefore answered them and said, My teaching is not mine, but his that sent me.అందుకు యేసునేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.
17 If any man willeth to do his will, he shall know of the teaching, whether it is of God, or `whether' I speak from myself.ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించు చున్నానో, వాడు తెలిసికొనును.
18 He that speaketh from himself seeketh his own glory: but he that seeketh the glory of him that sent him, the same is true, and no unrighteousness is in him.తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహి మను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
19 Did not Moses give you the law, and `yet' none of you doeth the law? Why seek ye to kill me?మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్ర మును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను.
20 The multitude answered, Thou hast a demon: who seeketh to kill thee?అందుకు జనసమూహమునీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
21 Jesus answered and said unto them, I did one work, and ye all marvel because thereof.యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడు చున్నారు.
22 Moses hath given you circumcision (not that it is of Moses, but of the fathers); and on the sabbath ye circumcise a man.మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయు చున్నారు.
23 If a man receiveth circumcision on the sabbath, that the law of Moses may not be broken; are ye wroth with me, because I made a man every whit whole on the sabbath?మోషే ధర్మ శాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?
24 Judge not according to appearance, but judge righteous judgment.వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
25 Some therefore of them of Jerusalem said, Is not this he whom they seek to kill?యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకు వాడు ఈయనే కాడా?
26 And lo, he speaketh openly, and they say nothing unto him. Can it be that the rulers indeed know that this is the Christ?ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా?
27 Howbeit we know this man whence he is: but when the Christ cometh, no one knoweth whence he is.అయినను ఈయన ఎక్కడి వాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన యెక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుకొనిరి.
28 Jesus therefore cried in the temple, teaching and saying, Ye both know me, and know whence I am; and I am not come of myself, but he that sent me is true, whom ye know not.కాగా యేసు దేవాలయములో బోధించుచుమీరు నన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు.
29 I know him; because I am from him, and he sent me.నేను ఆయన యొద్దనుండి వచ్చితిని;ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పెను.
30 They sought therefore to take him: and no man laid his hand on him, because his hour was not yet come.అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టు కొనలేదు.
31 But of the multitude many believed on him; and they said, When the Christ shall come, will he do more signs than those which this man hath done?మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిక్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటి కంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి.
32 The Pharisees heard the multitude murmuring these things concerning him; and the chief priests and the Pharisees sent officers to take him.జనసమూహము ఆయనను గూర్చి యీలాగు సణుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి.
33 Jesus therefore said, Yet a little while am I with you, and I go unto him that sent me.యేసు ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును; తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును;
34 Ye shall seek me, and shall not find me: and where I am, ye cannot come.మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను.
35 The Jews therefore said among themselves, Whither will this man go that we shall not find him? will he go unto the Dispersion among the Greeks, and teach the Greeks?అందుకు యూదులుమనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? గ్రీసుదేశస్థులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి గ్రీసుదేశస్థులకు బోధించునా?
36 What is this word that he said, Ye shall seek me, and shall not find me; and where I am, ye cannot come?నన్ను వెదకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి.
37 Now on the last day, the great `day' of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me and drink.ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచిఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను.
38 He that believeth on me, as the scripture hath said, from within him shall flow rivers of living water.నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
39 But this spake he of the Spirit, which they that believed on him were to receive: for the Spirit was not yet `given'; because Jesus was not yet glorified.తనయందు విశ్వాసముంచువారు పొంద బోవు ఆత్మనుగూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు.
40 `Some' of the multitude therefore, when they heard these words, said, This is of a truth the prophet.జనసమూహములో కొందరు ఈ మాటలు వినినిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి;
41 Others said, This is the Christ. But some said, What, doth the Christ come out of Galilee?మరికొందరుఈయన క్రీస్తే అనిరి; మరికొందరుఏమి? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా?
42 Hath not the scripture said that the Christ cometh of the seed of David, and from Bethlehem, the village where David was?క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి.
43 So there arose a division in the multitude because of him.కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను.
44 And some of them would have taken him; but no man laid hands on him.వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు.
45 The officers therefore came to the chief priests and Pharisees; and they said unto them, Why did ye not bring him?ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరి సయ్యులయొద్దకును వచ్చినప్పుడువారుఎందుకు మీ రాయ నను తీసికొని రాలేదని అడుగగా
46 The officers answered, Never man so spake.ఆ బంట్రౌతులుఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాట లాడలేదనిరి.
47 The Pharisees therefore answered them, Are ye also led astray?అందుకు పరిసయ్యులుమీరుకూడ మోస పోతిరా?
48 Hath any of the rulers believed on him, or of the Pharisees?అధి కారులలో గాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా?
49 But this multitude that knoweth not the law are accursed.అయితే ధర్మశాస్త్ర మెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి.
50 Nicodemus saith unto them (he that came to him before, being one of them),అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు.
51 Doth our law judge a man, except it first hear from himself and know what he doeth?అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
52 They answered and said unto him, Art thou also of Galilee? Search, and see that out of Galilee ariseth no prophet.వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి.
53 And they went every man unto his own house:అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి.
Telugu Bible