John 6 - YLT (Telugu)
1 After these things Jesus went away beyond the sea of Galilee (of Tiberias),అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
2 and there was following him a great multitude, because they were seeing his signs that he was doing on the ailing;రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి.
3 and Jesus went up to the mount, and he was there sitting with his disciples,యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.
4 and the passover was nigh, the feast of the Jews.అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.
5 Jesus then having lifted up `his' eyes and having seen that a great multitude doth come to him, saith unto Philip, `Whence shall we buy loaves, that these may eat?' --కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచివీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని
6 and this he said, trying him, for he himself had known what he was about to do.యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెను.
7 Philip answered him, `Two hundred denaries' worth of loaves are not sufficient to them, that each of them may receive some little;'అందుకు ఫిలిప్పువారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.
8 one of his disciples -- Andrew, the brother of Simon Peter -- saith to him,ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ
9 `There is one little lad here who hath five barley loaves, and two fishes, but these -- what are they to so many?'ఇక్కడ ఉన్న యొక చిన్న వానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా
10 And Jesus said, `Make the men to sit down;' and there was much grass in the place, the men then sat down, in number, as it were, five thousand,యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
11 and Jesus took the loaves, and having given thanks he distributed to the disciples, and the disciples to those reclining, in like manner, also of the little fishes as much as they wished.యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను;
12 And when they were filled, he saith to his disciples, `Gather together the broken pieces that are over, that nothing may be lost;'వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.
13 they gathered together, therefore, and filled twelve hand-baskets with broken pieces, from the five barley loaves that were over to those having eaten.కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.
14 The men, then, having seen the sign that Jesus did, said -- `This is truly the Prophet, who is coming to the world;'ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
15 Jesus, therefore, having known that they are about to come, and to take him by force that they may make him king, retired again to the mountain himself alone.రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
16 And when evening came, his disciples went down to the sea,సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.
17 and having entered into the boat, they were going over the sea to Capernaum, and darkness had already come, and Jesus had not come unto them,అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
18 the sea also -- a great wind blowing -- was being raised,అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.
19 having pushed onwards, therefore, about twenty-five or thirty furlongs, they behold Jesus walking on the sea, and coming nigh to the boat, and they were afraid;వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;
20 and he saith to them, `I am `he', be not afraid;'అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను.
21 they were willing then to receive him into the boat, and immediately the boat came unto the land to which they were going.కనుక ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.
22 On the morrow, the multitude that was standing on the other side of the sea, having seen that there was no other little boat there except one -- that into which his disciples entered -- and that Jesus went not in with his disciples into the little boat, but his disciples went away alone,మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.
23 (and other little boats came from Tiberias, nigh the place where they did eat the bread, the Lord having given thanks),అయితే ప్రభువు కృతజ్ఞతా స్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు నకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.
24 when therefore the multitude saw that Jesus is not there, nor his disciples, they also themselves did enter into the boats, and came to Capernaum seeking Jesus;కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.
25 and having found him on the other side of the sea, they said to him, `Rabbi, when hast thou come hither?'సముద్రపుటద్దరిని ఆయనను కనుగొనిబోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా
26 Jesus answered them and said, `Verily, verily, I say to you, Ye seek me, not because ye saw signs, but because ye did eat of the loaves, and were satisfied;యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
27 work not for the food that is perishing, but for the food that is remaining to life age-during, which the Son of Man will give to you, for him did the Father seal -- `even' God.'క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.
28 They said therefore unto him, `What may we do that we may work the works of God?'వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయ వలెనని ఆయనను అడుగగా
29 Jesus answered and said to them, `This is the work of God, that ye may believe in him whom He did send.'యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను.
30 They said therefore to him, `What sign, then, dost thou, that we may see and may believe thee? what dost thou work?వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?
31 our fathers the manna did eat in the wilderness, according as it is having been written, Bread out of the heaven He gave them to eat.'భుజించు టకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.
32 Jesus, therefore, said to them, `Verily, verily, I say to you, Moses did not give you the bread out of the heaven; but my Father doth give you the true bread out of the heaven;కాబట్టి యేసుపరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు.
33 for the bread of God is that which is coming down out of the heaven, and giving life to the world.'పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను.
34 They said, therefore, unto him, `Sir, always give us this bread.'కావున వారు ప్రభువా,యీ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించు మనిరి.
35 And Jesus said to them, `I am the bread of the life; he who is coming unto me may not hunger, and he who is believing in me may not thirst -- at any time;అందుకు యేసు వారితో ఇట్లనెనుజీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు,
36 but I said to you, that ye also have seen me, and ye believe not;నాయందు విశ్వాసముంచు వాడు ఎప్పుడును దప్పిగొనడు.
37 all that the Father doth give to me will come unto me; and him who is coming unto me, I may in no wise cast without,మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.
38 because I have come down out of the heaven, not that I may do my will, but the will of Him who sent me.తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను.
39 `And this is the will of the Father who sent me, that all that He hath given to me I may not lose of it, but may raise it up in the last day;నా యిష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.
40 and this is the will of Him who sent me, that every one who is beholding the Son, and is believing in him, may have life age-during, and I will raise him up in the last day.'ఆయన నాకు అనుగ్రహించిన దాని యంతటిలో నేనే మియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది.
41 The Jews, therefore, were murmuring at him, because he said, `I am the bread that came down out of the heaven;'కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.
42 and they said, `Is not this Jesus, the son of Joseph, whose father and mother we have known? how then saith this one -- Out of the heaven I have come down?'కాబట్టి నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహార మని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచుఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా?
43 Jesus answered, therefore, and said to them, `Murmur not one with another;ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? నేను పరలోకమునుండి దిగి వచ్చి యున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.
44 no one is able to come unto me, if the Father who sent me may not draw him, and I will raise him up in the last day;అందుకు యేసుమీలో మీరు సణుగుకొనకుడి;
45 it is having been written in the prophets, And they shall be all taught of God; every one therefore who heard from the Father, and learned, cometh to me;నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
46 not that any one hath seen the Father, except he who is from God, he hath seen the Father.వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.
47 `Verily, verily, I say to you, He who is believing in me, hath life age-during;దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు.
48 I am the bread of the life;విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే.
49 your fathers did eat the manna in the wilderness, and they died;మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.
50 this is the bread that out of the heaven is coming down, that any one may eat of it, and not die.దీనిని తినువాడు చావ కుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహార మిదే.
51 `I am the living bread that came down out of the heaven; if any one may eat of this bread he shall live -- to the age; and the bread also that I will give is my flesh, that I will give for the life of the world.'పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
52 The Jews, therefore, were striving with one another, saying, `How is this one able to give us `his' flesh to eat?'యూదులుఈయన తన శరీరమును ఏలాగు తిన నియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.
53 Jesus, therefore, said to them, `Verily, verily, I say to you, If ye may not eat the flesh of the Son of Man, and may not drink his blood, ye have no life in yourselves;కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు.
54 he who is eating my flesh, and is drinking my blood, hath life age-during, and I will raise him up in the last day;నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.
55 for my flesh truly is food, and my blood truly is drink;నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.
56 he who is eating my flesh, and is drinking my blood, doth remain in me, and I in him.నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము.
57 `According as the living Father sent me, and I live because of the Father, he also who is eating me, even that one shall live because of me;జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
58 this is the bread that came down out of the heaven; not as your fathers did eat the manna, and died; he who is eating this bread shall live -- to the age.'ఇదే పర లోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు గాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాననెను
59 These things he said in a synagogue, teaching in Capernaum;ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను.
60 many, therefore, of his disciples having heard, said, `This word is hard; who is able to hear it?'ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
61 And Jesus having known in himself that his disciples are murmuring about this, said to them, `Doth this stumble you?యేసు తన శిష్యులు దీనినిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెనుదీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా?
62 if then ye may behold the Son of Man going up where he was before?ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?
63 the spirit it is that is giving life; the flesh doth not profit anything; the sayings that I speak to you are spirit, and they are life;ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని
64 but there are certain of you who do not believe;' for Jesus had known from the beginning who they are who are not believing, and who is he who will deliver him up,మీలో విశ్వ సించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వ సించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసునకు తెలియును.
65 and he said, `Because of this I have said to you -- No one is able to come unto me, if it may not have been given him from my Father.'మరియు ఆయన తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను.
66 From this `time' many of his disciples went away backward, and were no more walking with him,అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.
67 Jesus, therefore, said to the twelve, `Do ye also wish to go away?'కాబట్టి యేసుమీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండుమందిని అడుగగా
68 Simon Peter, therefore, answered him, `Sir, unto whom shall we go? thou hast sayings of life age-during;సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;
69 and we have believed, and we have known, that thou art the Christ, the Son of the living God.'నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను.
70 Jesus answered them, `Did not I choose you -- the twelve? and of you -- one is a devil.అందుకు యేసునేను మిమ్మును పండ్రెండుగురిని ఏర్పరచు కొనలేదా? మీలో ఒకడు సాతాను అనివారితో చెప్పెను.
71 And he spake of Judas, Simon's `son', Iscariot, for he was about to deliver him up, being one of the twelve.సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయన నప్పగింపబోవు చుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.
Telugu Bible