John 21 - DBY (Telugu)
1 After these things Jesus manifested himself again to the disciples at the sea of Tiberias. And he manifested [himself] thus.అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా
2 There were together Simon Peter, and Thomas called Didymus, and Nathanael who was of Cana of Galilee, and the [sons] of Zebedee, and two others of his disciples.సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అనుఊరివాడగు నతనయేలును,జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.
3 Simon Peter says to them, I go to fish. They say to him, We also come with thee. They went forth, and went on board, and that night took nothing.సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారుమేమును నీతో కూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.
4 And early morn already breaking, Jesus stood on the shore; the disciples however did not know that it was Jesus.సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
5 Jesus therefore says to them, Children, have ye anything to eat? They answered him, No.యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
6 And he said to them, Cast the net at the right side of the ship and ye will find. They cast therefore, and they could no longer draw it, from the multitude of fishes.లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయనదోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.
7 That disciple therefore whom Jesus loved says to Peter, It is the Lord. Simon Peter therefore, having heard that it was the Lord, girded his overcoat [on him] (for he was naked), and cast himself into the sea;కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడుఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.
8 and the other disciples came in the small boat, for they were not far from the land, but somewhere about two hundred cubits, dragging the net of fishes.దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.
9 When therefore they went out on the land, they see a fire of coals there, and fish laid on it, and bread.వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
10 Jesus says to them, Bring of the fishes which ye have now taken.యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా
11 Simon Peter went up and drew the net to the land full of great fishes, a hundred and fifty-three; and though there were so many, the net was not rent.సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;
12 Jesus says to them, Come [and] dine. But none of the disciples dared inquire of him, Who art thou? knowing that it was the Lord.చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.
13 Jesus comes and takes the bread and gives it to them, and the fish in like manner.యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.
14 This is already the third time that Jesus had been manifested to the disciples, being risen from among [the] dead.యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.
15 When therefore they had dined, Jesus says to Simon Peter, Simon, [son] of Jonas, lovest thou me more than these? He says to him, Yea, Lord; thou knowest that I am attached to thee. He says to him, Feed my lambs.వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచియెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసునా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
16 He says to him again a second time, Simon, [son] of Jonas, lovest thou me? He says to him, Yea, Lord; thou knowest that I am attached to thee. He says to him, Shepherd my sheep.మరల ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన నా గొఱ్ఱలను కాయుమని చెప్పెను.
17 He says to him the third time, Simon, [son] of Jonas, art thou attached to me? Peter was grieved because he said to him the third time, Art thou attached to me? and said to him, Lord, thou knowest all things; thou knowest that I am attached to thee. Jesus says to him, Feed my sheep.మూడవసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడిప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.
18 Verily, verily, I say to thee, When thou wast young, thou girdedst thyself, and walkedst where thou desiredst; but when thou shalt be old, thou shalt stretch forth thy hands, and another shall gird thee, and bring thee where thou dost not desire.యేసు నా గొఱ్ఱలను మేపుము. నీవు ¸°వనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.
19 But he said this signifying by what death he should glorify God. And having said this, he says to him, Follow me.అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పినన్ను వెంబడించుమని అతనితో అనెను.
20 Peter, turning round, sees the disciple whom Jesus loved following, who also leaned at supper on his breast, and said, Lord, who is it that delivers thee up?పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొనిప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను.
21 Peter, seeing him, says to Jesus, Lord, and what [of] this [man]?పేతురు అతనిని చూచి ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.
22 Jesus says to him, If I will that he abide until I come, what [is that] to thee? Follow thou me.యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
23 This word therefore went out among the brethren, That disciple does not die. And Jesus did not say to him, He does not die; but, If I will that he abide until I come, what [is that] to thee?కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గానినేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.
24 This is the disciple who bears witness concerning these things, and who has written these things; and we know that his witness is true.ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.
25 And there are also many other things which Jesus did, the which if they were written one by one, I suppose that not even the world itself would contain the books written.యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
Telugu Bible