Bible

John 2 - BBE (Telugu)

1 On the third day two people were going to be married at Cana in Galilee. The mother of Jesus was there:మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.

2 And Jesus with his disciples came as guests.యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి.

3 When they had not enough wine, the mother of Jesus said to him, They have no wine.ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా

4 Jesus said to her, Woman, this is not your business; my time is still to come.యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.

5 His mother said to the servants, Whatever he says to you, do it.ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.

6 Now six pots of stone, every one taking two or three firkins of water, were placed there for the purpose of washing, as is the way of the Jews.యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.

7 Jesus said to the servants, Make the pots full of water. And they made them full to the top.యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.

8 Then he said to them, Now take some, and give it to the master of the feast. So they took it to him.అప్పుడాయన వారితోమీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.

9 After tasting the water which had now become wine, the master of the feast (having no idea where it came from, though it was clear to the servants who took the water out) sent for the newly-married man,ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి

10 And said to him, Every man first puts out his best wine and when all have had enough he puts out what is not so good; but you have kept the good wine till now.ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.

11 This, the first of his signs, Jesus did at Cana in Galilee and let his glory be seen openly; and his disciples put their faith in him.గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.

12 After this he went down to Capernaum, with his mother, his brothers, and his disciples, and they were there not more than two or three days.అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.

13 The time of the Passover of the Jews was near and Jesus went up to Jerusalem.యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి

14 And there in the Temple he saw men trading in oxen and sheep and doves, and he saw the changers of money in their seats:దేవాలయములో ఎడ్లను గొఱ్ఱలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి

15 And he made a whip of small cords and put them all out of the Temple, with the sheep and the oxen, sending in all directions the small money of the changers and overturning their tables;త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి

16 And to those who were trading in doves he said, Take these things away; do not make my Father's house a market.పావురములు అమ్ము వారితోవీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.

17 And it came to the minds of the disciples that the Writings say, I am on fire with passion for your house.ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.

18 Then the Jews put this question to him: What sign of authority have you to give us, seeing that you do these things?కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా

19 And Jesus said to them, Send destruction on this Temple and I will put it up again in three days.యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.

20 The Jews said, The building of this Temple took forty-six years; and you will put it up in three days!యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి.

21 But his words were about that holy building which was his body.అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.

22 So when he had come back again from the dead, the memory of these words came back to the disciples, and they had faith in the holy Writings and in the word which Jesus had said.ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమి్మరి.

23 Now while he was in Jerusalem at the feast of the Passover, a great number of people came to have faith in his name, after seeing the signs which he did.ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూష లేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.

24 But Jesus did not have faith in them, because he had knowledge of them all.అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు

25 He had no need for any witness about man; for he himself had knowledge of what was in man.గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.

Telugu Bible