Job 7 - WEB (Telugu)
1 "Isn't a man forced to labor on earth? Aren't his days like the days of a hired hand?భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా?వారి దినములు కూలివాని దినములవంటివి కావా?
2 As a servant who earnestly desires the shadow, As a hireling who looks for his wages,నీడను మిగుల నపేక్షించు దాసునివలెనుకూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను
3 So am I made to possess months of misery, Wearisome nights are appointed to me.ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి యున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల
4 When I lie down, I say, 'When shall I arise, and the night be gone?' I toss and turn until the dawning of the day.ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడు దును.
5 My flesh is clothed with worms and clods of dust. My skin closes up, and breaks out afresh.నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్ప బడియున్నది.నా చర్మము మాని మరల పగులుచున్నది.
6 My days are swifter than a weaver's shuttle, And are spent without hope.నా దినములు నేతగాని నాడెకంటెను వడిగా గతించు చున్నవినిరీక్షణ లేక అవి క్షయమై పోవుచున్నవి.
7 Oh remember that my life is a breath. My eye shall no more see good.నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
8 The eye of him who sees me shall see me no more. Your eyes shall be on me, but I shall not be.నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు.నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
9 As the cloud is consumed and vanishes away, So he who goes down to Sheol shall come up no more.మేఘము విడిపోయి అదృశ్యమగునట్లుపాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునురాడు
10 He shall return no more to his house, Neither shall his place know him any more.అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు అతని స్థలము అతని మరల నెరుగదు.
11 "Therefore I will not keep silent. I will speak in the anguish of my spirit. I will complain in the bitterness of my soul.కావున నేను నా నోరు మూసికొననునా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదనునా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
12 Am I a sea, or a sea-monster, That you put a guard over me?నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?
13 When I say, 'My bed shall comfort me, My couch shall ease my complaint;'నా మంచము నాకు ఆదరణ ఇచ్చును.నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అనినేననుకొనగా
14 Then you scar me with dreams, And terrify me through visions:నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవుదర్శనములవలన నన్ను భయపెట్టెదవు.
15 So that my soul chooses strangling, Death rather than my bones.కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
16 I loathe my life. I don't want to live forever. Leave me alone; for my days are but a breath.అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.
17 What is man, that you should magnify him, That you should set your mind on him,మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
18 That you should visit him every morning, And test him every moment?ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?
19 How long will you not look away from me, Nor leave me alone until I swallow down my spittle?ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
20 If I have sinned, what do I do to you, you watcher of men? Why have you set me as a mark for you, So that I am a burden to myself?నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగా నున్నాను, నీవేల గురి పెట్టితివి?
21 Why do you not pardon my disobedience, and take away my iniquity? For now shall I lie down in the dust. You will seek me diligently, but I shall not be."నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదనునీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.
Telugu Bible