Sign in / My account

Job 29 - WEB (Telugu)

1 Job again took up his parable, and said,యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను

2 "Oh that I were as in the months of old, As in the days when God watched over me;పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు

3 When his lamp shone on my head, And by his light I walked through darkness;అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడు చుంటిని.

4 As I was in the ripeness of my days, When the friendship of God was in my tent;నా పరిపక్వదినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.

5 When the Almighty was yet with me, And my children were around me;సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి

6 When my steps were washed with butter, And the rock poured out streams of oil for me!నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.

7 When I went forth to the city gate, When I prepared my seat in the street,పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు

8 The young men saw me and hid themselves, The aged rose up and stood;¸°వనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.

9 The princes refrained from talking, And laid their hand on their mouth;అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.

10 The voice of the nobles was hushed, And their tongue stuck to the roof of their mouth.ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.

11 For when the ear heard me, then it blessed me; And when the eye saw me, it commended me:నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను.నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.

12 Because I delivered the poor who cried, And the fatherless also, who had none to help him.ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడి పించితిని.

13 The blessing of him who was ready to perish came on me, And I caused the widow's heart to sing for joy.నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని

14 I put on righteousness, and it clothed me. My justice was as a robe and a diadem.నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.

15 I was eyes to the blind, And feet to the lame.గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.

16 I was a father to the needy. The cause of him who I didn't know, I searched out.దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచా రించితిని.

17 I broke the jaws of the unrighteous, And plucked the prey out of his teeth.దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

18 Then I said, 'I shall die in my own house, I shall number my days as the sand.అప్పుడు నేనిట్లనుకొంటినినా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.

19 My root is spread out to the waters, The dew lies all night on my branch;నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.

20 My glory is fresh in me, My bow is renewed in my hand.'నాకు ఎడతెగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

21 "Men listened to me, waited, And kept silence for my counsel.మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.

22 After my words they didn't speak again; My speech fell on them.నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలుక కుండిరి.గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

23 They waited for me as for the rain. Their mouths drank as with the spring rain.వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కని పెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.

24 I smiled on them when they had no confidence. They didn't reject the light of my face.వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవి్వతిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.

25 I chose out their way, and sat as chief. I lived as a king in the army, As one who comforts the mourners.నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.

Telugu Bible