Job 24 - WEB (Telugu)
1 "Why aren't times laid up by the Almighty? Why don't those who know him see his days?సర్వశక్తుడగువాడు నియామకకాలములను ఎందుకు... ఏర్పాటుచేయడు?ఆయన నెరిగియున్నవారు ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు?
2 There are people who remove the landmarks. They violently take away flocks, and feed them.సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరు వారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొనివాటిని మేపుదురు.
3 They drive away the donkey of the fatherless, And they take the widow's ox for a pledge.తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
4 They turn the needy out of the way. The poor of the earth all hide themselves.వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించివేయుదురుదేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
5 Behold, as wild donkeys in the desert, They go forth to their work, seeking diligently for food; The wilderness yields them bread for their children.అరణ్యములోని అడవిగాడిదలు తిరుగునట్లుబీదవారు తమ పనిమీద బయలుదేరి వేటను వెదకుదురుఎడారిలో వారి పిల్లలకు ఆహారము దొరకును
6 They cut their provender in the field. They glean the vineyard of the wicked.పొలములో వారు తమకొరకు గడ్డి కోసికొందురుదుష్టుల ద్రాక్షతోటలలో పరిగ ఏరుదురు.
7 They lie all night naked without clothing, And have no covering in the cold.బట్టలులేక రాత్రి అంతయు పండుకొనియుందురుచలిలో వస్త్రహీనులై పడియుందురు.
8 They are wet with the showers of the mountains, And embrace the rock for lack of a shelter.పర్వతములమీది జల్లులకు తడిసియుందురుచాటులేనందున బండను కౌగలించుకొందురు.
9 There are those who pluck the fatherless from the breast, And take a pledge of the poor,తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు
10 So that they go around naked without clothing. Being hungry, they carry the sheaves.దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురుఆకలిగొని పనలను మోయుదురు.
11 They make oil within the walls of these men. They tread wine presses, and suffer thirst.వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.
12 From out of the populous city, men groan. The soul of the wounded cries out, Yet God doesn't regard the folly.జనముగల పట్టణములో మూలుగుదురుగాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
13 "These are of those who rebel against the light; They don't know the ways of it, Nor abide in the paths of it.వెలుగుమీద తిరుగబడువారు కలరువీరు దాని మార్గములను గురుతుపట్టరుదాని త్రోవలలో నిలువరు.
14 The murderer rises with the light. He kills the poor and needy. In the night he is like a thief.తెల్లవారునప్పుడు నరహంతకుడు లేచునువాడు దరిద్రులను లేమిగలవారిని చంపునురాత్రియందు వాడు దొంగతనము చేయును.
15 The eye also of the adulterer waits for the twilight, Saying, 'No eye shall see me.' He disguises his face.వ్యభిచారిఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.
16 In the dark they dig through houses. They shut themselves up in the daytime. They don't know the light.చీకటిలో వారు కన్నము వేయుదురుపగలు దాగుకొందురువారు వెలుగు చూడనొల్లరు
17 For the morning is to all of them like thick darkness, For they know the terrors of the thick darkness.వారందరు ఉదయమును మరణాంధకారముగాఎంచుదురు.గాఢాంధకార భయము ఎట్టిదైనది వారికి తెలిసియున్నది.
18 "They are foam on the surface of the waters. Their portion is cursed in the earth: They don't turn into the way of the vineyards.జలములమీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురువారి స్వాస్థ్యము భూమిమీద శాపగ్రస్తముద్రాక్షతోటల మార్గమున వారు ఇకను నడువరు.
19 Drought and heat consume the snow waters; So does Sheol those who have sinned.అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లుపాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.
20 The womb shall forget him. The worm shall feed sweetly on him. He shall be no more remembered. Unrighteousness shall be broken as a tree.కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
21 He devours the barren who don't bear. He shows no kindness to the widow.వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురువిధవరాండ్రకు మేలుచేయరు.
22 Yet God preserves the mighty by his power. He rises up who has no assurance of life.ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
23 God gives them security, and they rest in it. His eyes are on their ways.ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురుఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
24 They are exalted; yet a little while, and they are gone. Yes, they are brought low, they are taken out of the way as all others, And are cut off as the tops of the ears of grain.వారు హెచ్చింపబడిననుకొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
25 If it isn't so now, who will prove me a liar, And make my speech worth nothing?"ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
Telugu Bible