Job 21 - BBE (Telugu)
1 Then Job made answer and said,అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
2 Give attention with care to my words; and let this be your comfort.నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
3 Let me say what is in my mind, and after that, go on making sport of me.నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.
4 As for me, is my outcry against man? is it then to be wondered at if my spirit is troubled?నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
5 Take note of me and be full of wonder, put your hand on your mouth.నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి.
6 At the very thought of it my flesh is shaking with fear.నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
7 Why is life given to the evil-doers? why do they become old and strong in power?భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
8 Their children are ever with them, and their offspring before their eyes.వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.
9 Their houses are free from fear, and the rod of God does not come on them.వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు.
10 Their ox is ready at all times to give seed; their cow gives birth, without dropping her young.వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
11 They send out their young ones like a flock, and their children have pleasure in the dance,వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.
12 They make songs to the instruments of music, and are glad at the sound of the pipe.తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు.
13 Their days come to an end without trouble, and suddenly they go down to the underworld.వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
14 Though they said to God, Go away from us, for we have no desire for the knowledge of your ways.వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
15 What is the Ruler of all, that we may give him worship? and what profit is it to us to make prayer to him?మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
16 Truly, is not their well-being in their power? (The purpose of the evil-doers is far from me.)వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.
17 How frequently is the light of the evil-doers put out, or does trouble come on them? how frequently does his wrath take them with cords?భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.
18 How frequently are they as dry stems before the wind, or as grass taken away by the storm-wind?వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.
19 You say, God keeps punishment stored up for his children. Let him send it on the man himself, so that he may have the punishment of it!వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక
20 Let his eyes see his trouble, and let him be full of the wrath of the Ruler of all!వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత
21 For what interest has he in his house after him, when the number of his months is ended?తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి?
22 Is anyone able to give teaching to God? for he is the judge of those who are on high.ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
23 One comes to his end in complete well-being, full of peace and quiet:ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను
24 His buckets are full of milk, and there is no loss of strength in his bones.సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును
25 And another comes to his end with a bitter soul, without ever tasting good.వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును.
26 Together they go down to the dust, and are covered by the worm.వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.
27 See, I am conscious of your thoughts, and of your violent purposes against me;మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
28 For you say, Where is the house of the ruler, and where is the tent of the evil-doer?అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
29 Have you not put the question to the travellers, and do you not take note of their experience?దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?
30 How the evil man goes free in the day of trouble, and has salvation in the day of wrath?అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
31 Who will make his way clear to his face? and if he has done a thing, who gives him punishment for it?వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?
32 He is taken to his last resting-place, and keeps watch over it.వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును
33 The earth of the valley covering his bones is sweet to him, and all men come after him, as there were unnumbered before him.పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.
34 Why then do you give me comfort with words in which there is no profit, when you see that there is nothing in your answers but deceit?మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?
Telugu Bible