Bible

Job 21 - ASV (Telugu)

1 Then Job answered and said,అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను

2 Hear diligently my speech; And let this be your consolations.నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.

3 Suffer me, and I also will speak; And after that I have spoken, mock on.నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.

4 As for me, is my complaint to man? And why should I not be impatient?నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?

5 Mark me, and be astonished, And lay your hand upon your mouth.నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి.

6 Even when I remember I am troubled, And horror taketh hold on my flesh.నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.

7 Wherefore do the wicked live, Become old, yea, wax mighty in power?భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?

8 Their seed is established with them in their sight, And their offspring before their eyes.వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.

9 Their houses are safe from fear, Neither is the rod of God upon them.వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు.

10 Their bull gendereth, and faileth not; Their cow calveth, and casteth not her calf.వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.

11 They send forth their little ones like a flock, And their children dance.వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.

12 They sing to the timbrel and harp, And rejoice at the sound of the pipe.తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు.

13 They spend their days in prosperity, And in a moment they go down to Sheol.వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.

14 And they say unto God, Depart from us; For we desire not the knowledge of thy ways.వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.

15 What is the Almighty, that we should serve him? And what profit should we have, if we pray unto him?మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు

16 Lo, their prosperity is not in their hand: The counsel of the wicked is far from me.వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.

17 How oft is it that the lamp of the wicked is put out? That their calamity cometh upon them? That `God' distributeth sorrows in his anger?భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.

18 That they are as stubble before the wind, And as chaff that the storm carrieth away?వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.

19 `Ye say', God layeth up his iniquity for his children. Let him recompense it unto himself, that he may know it:వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక

20 Let his own eyes see his destruction, And let him drink of the wrath of the Almighty.వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత

21 For what careth he for his house after him, When the number of his months is cut off?తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి?

22 Shall any teach God knowledge, Seeing he judgeth those that are high?ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.

23 One dieth in his full strength, Being wholly at ease and quiet:ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను

24 His pails are full of milk, And the marrow of his bones is moistened.సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును

25 And another dieth in bitterness of soul, And never tasteth of good.వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును.

26 They lie down alike in the dust, And the worm covereth them.వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.

27 Behold, I know your thoughts, And the devices wherewith ye would wrong me.మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

28 For ye say, Where is the house of the prince? And where is the tent wherein the wicked dwelt?అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.

29 Have ye not asked wayfaring men? And do ye not know their evidences,దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?

30 That the evil man is reserved to the day of calamity? That they are led forth to the day of wrath?అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.

31 Who shall declare his way to his face? And who shall repay him what he hath done?వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?

32 Yet shall he be borne to the grave, And men shall keep watch over the tomb.వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును

33 The clods of the valley shall be sweet unto him, And all men shall draw after him, As there were innumerable before him.పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.

34 How then comfort ye me in vain, Seeing in your answers there remaineth `only' falsehood?మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?

Telugu Bible