Bible

Isaiah 21 - WEB (Telugu)

1 The burden of the wilderness of the sea. As whirlwinds in the South sweep through, it comes from the wilderness, from an awesome land.సముద్రతీరముననున్న అడవిదేశమును గూర్చిన దేవోక్తి దక్షిణదిక్కున సుడిగాలి విసరునట్లు అరణ్యమునుండి భీకరదేశమునుండి అది వచ్చుచున్నది.

2 A grievous vision is declared to me; the treacherous man deals treacherously, and the destroyer destroys. Go up, Elam; besiege, Media; all the sighing of it have I made to cease.కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

3 Therefore are my loins filled with anguish; pangs have taken hold on me, as the pangs of a woman in travail: I am pained so that I can't hear; I am dismayed so that I can't see.కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నన్ను పట్టి యున్నది బాధచేత నేను వినలేకుండ నున్నాను విభ్రాంతిచేత నేను చూడలేకుండ నున్నాను.

4 My heart flutters, horror has frightened me; the twilight that I desired has been turned into trembling to me.నా గుండె తటతట కొట్టుకొనుచున్నది మహా భయము నన్ను కలవరపరచుచున్నది నా కిష్టమైన సంధ్యవేళ నాకు భీకరమాయెను.

5 They prepare the table, they set the watch, they eat, they drink: rise up, you princes, anoint the shield.వారు భోజనపు బల్లను సిద్ధముచేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కేడెములకు చమురు రాయుడి; ప్రభువు నాతో ఇట్లనెను

6 For thus has the Lord said to me, Go, set a watchman: let him declare what he sees:నీవు వెళ్లి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడుదానిని తెలియజేయవలెను.

7 and when he sees a troop, horsemen in pairs, a troop of donkeys, a troop of camels, he shall listen diligently with much heed.జతజతలుగా వచ్చు రౌతులును వరుసలుగా వచ్చు గాడిదలును వరుసలుగావచ్చు ఒంటెలును అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూచును

8 He cried as a lion: Lord, I stand continually on the watch-tower in the day-time, and am set in my ward whole nights;సింహము గర్జించునట్టు కేకలు వేసి నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయుచున్నాను

9 and, behold, here comes a troop of men, horsemen in pairs. He answered, Fallen, fallen is Babylon; and all the engraved images of her gods are broken to the ground.ఇదిగో జతజతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను.బబులోను కూలెను కూలెనుదాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన నేలనుపడవేసియున్నాడుముక్కముక్కలుగా విరుగగొట్టియున్నాడు అనిచెప్పుచు వచ్చెను.

10 You my threshing, and the grain of my floor! that which I have heard from Yahweh of hosts, the God of Israel, have I declared to you.నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్లములో నూర్చ బడినవాడా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవావలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను.

11 The burden of Dumah. One calls to me out of Seir, Watchman, what of the night? Watchman, what of the night?దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు

12 The watchman said, "The morning comes, and also the night. If you will inquire, inquire. Come back again."కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరినయెడల విచారించుడి మరల రండి అనుచున్నాడు.

13 The burden on Arabia. In the forest in Arabia shall you lodge, you caravans of Dedanites.అరేబియాను గూర్చిన దేవోక్తి దెదానీయులైన సార్థవాహులారా, సాయంకాలమున మీరు అరబి యెడారిలో దిగవలెను.

14 To him who was thirsty they brought water; the inhabitants of the land of Tema did meet the fugitives with their bread.తేమాదేశనివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి

15 For they fled away from the swords, from the drawn sword, and from the bent bow, and from the heat of battle.ఖడ్గ భయముచేతను దూసిన ఖడ్గ భయము చేతను ఎక్కు పెట్టబడిన ధనుస్సుల భయముచేతను క్రూరయుద్ధ భయముచేతను వారు పారిపోవు చున్నారు

16 For thus has the Lord said to me, Within a year, according to the years of a hireling, all the glory of Kedar shall fail;ప్రభువు నాకీలాగు సెలవిచ్చియున్నాడుకూలి వారు ఎంచునట్లుగా ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును.

17 and the residue of the number of the archers, the mighty men of the children of Kedar, shall be few; for Yahweh, the God of Israel, has spoken it.కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించు వారు కొద్దివారగుదురు. ఈలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు.

Telugu Bible