Bible

Genesis 4 - BBE (Telugu)

1 And the man had connection with Eve his wife, and she became with child and gave birth to Cain, and said, I have got a man from the Lord.ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కనియెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.

2 Then again she became with child and gave birth to Abel, his brother. And Abel was a keeper of sheep, but Cain was a farmer.తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.

3 And after a time, Cain gave to the Lord an offering of the fruits of the earth.కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.

4 And Abel gave an offering of the young lambs of his flock and of their fat. And the Lord was pleased with Abel's offering;హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను;

5 But in Cain and his offering he had no pleasure. And Cain was angry and his face became sad.కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా

6 And the Lord said to Cain, Why are you angry? and why is your face sad?యెహోవా కయీనుతోనీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చు కొని యున్నావేమి?

7 If you do well, will you not have honour? and if you do wrong, sin is waiting at the door, desiring to have you, but do not let it be your master.నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

8 And Cain said to his brother, Let us go into the field: and when they were in the field, Cain made an attack on his brother Abel and put him to death.కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.

9 And the Lord said to Cain, Where is your brother Abel? And he said, I have no idea: am I my brother's keeper?యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

10 And he said, What have you done? the voice of your brother's blood is crying to me from the earth.అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.

11 And now you are cursed from the earth, whose mouth is open to take your brother's blood from your hand;కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు;

12 No longer will the earth give you her fruit as the reward of your work; you will be a wanderer in flight over the earth.నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.

13 And Cain said, My punishment is greater than my strength.అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

14 You have sent me out this day from the face of the earth and from before your face; I will be a wanderer in flight over the earth, and whoever sees me will put me to death.నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.

15 And the Lord said, Truly, if Cain is put to death, seven lives will be taken for his. And the Lord put a mark on Cain so that no one might put him to death.అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండున

16 And Cain went away from before the face of the Lord, and made his living-place in the land of Nod on the east of Eden.అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.

17 And Cain had connection with his wife and she became with child and gave birth to Enoch: and he made a town, and gave the town the name of Enoch after his son.కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.

18 And Enoch had a son Irad: and Irad became the father of Mehujael: and Mehujael became the father of Methushael: and Methushael became the father of Lamech.హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషా యేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.

19 And Lamech had two wives; the name of the one was Adah, and the name of the other Zillah.లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదానిపేరు సిల్లా.

20 And Adah gave birth to Jabal: he was the father of such as are living in tents and keep cattle.ఆదా యా బాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.

21 And his brother's name was Jubal: he was the father of all players on instruments of music.అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు.

22 And Zillah gave birth to Tubal-cain, who is the father of every maker of cutting instruments of brass and iron: and the sister of Tubal-cain was Naamah.మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.

23 And Lamech said to his wives, Adah and Zillah, give ear to my voice; you wives of Lamech, give attention to my words, for I would put a man to death for a wound, and a young man for a blow;లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని

24 If seven lives are to be taken as punishment for Cain's death, seventy-seven will be taken for Lamech's.ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.

25 And Adam had connection with his wife again, and she gave birth to a son to whom she gave the name of Seth: for she said, God has given me another seed in place of Abel, whom Cain put to death.ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కనికయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను.

26 And Seth had a son, and he gave him the name of Enosh: at this time men first made use of the name of the Lord in worship.మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

Telugu Bible