Bible

Genesis 26 - WEB (Telugu)

1 There was a famine in the land, besides the first famine that was in the days of Abraham. Isaac went to Abimelech king of the Philistines, to Gerar.అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

2 Yahweh appeared to him, and said, "Don't go down into Egypt. Dwell in the land which I will tell you of.అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమైనీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.

3 Sojourn in this land, and I will be with you, and will bless you. For to you, and to your seed, I will give all these lands, and I will establish the oath which I swore to Abraham your father.ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వ దించెదను;

4 I will multiply your seed as the stars of the sky, and will give to your seed all these lands. In your seed will all the nations of the earth be blessed,ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.

5 because Abraham obeyed my voice, and kept my charge, my commandments, my statutes, and my laws."ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞ లను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

6 Isaac lived in Gerar.ఇస్సాకు గెరారులో నివసించెను.

7 The men of the place asked him about his wife. He said, "She is my sister," for he was afraid to say, "My wife," lest, he thought, the men of the place might kill me for Rebekah, because she was beautiful to look on.ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచిఆమె యెవరని అడిగినప్పుడు అతడుఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.

8 It happened, when he had been there a long time, that Abimelech king of the Philistines looked out at a window, and saw, and, behold, Isaac was caressing Rebekah, his wife.అక్కడ అతడు చాలా దినము లుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.

9 Abimelech called Isaac, and said, "Behold, surely she is your wife. Why did you say, 'She is my sister?'" Isaac said to him, "Because I said, 'Lest I die because of her.'"అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించిఇదిగో ఆమె నీ భార్యయేఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకుఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.

10 Abimelech said, "What is this you have done to us? One of the people might easily have lain with your wife, and you would have brought guilt on us!"అందుకు అబీమెలెకునీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయ నించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.

11 Abimelech charged all the people, saying, "He who touches this man or his wife will surely be put to death."అబీమెలెకుఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా

12 Isaac sowed in that land, and reaped in the same year one hundred times what he planted. Yahweh blessed him.ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

13 The man grew great, and grew more and more until he became very great.అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.

14 He had possessions of flocks, possessions of herds, and a great household. The Philistines envied him.అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహ మును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

15 Now all the wells which his father's servants had dug in the days of Abraham his father, the Philistines had stopped, and filled with earth.అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

16 Abimelech said to Isaac, "Go from us, for you are much mightier than we."అబీమెలెకునీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సా కుతో చెప్పగా

17 Isaac departed from there, encamped in the valley of Gerar, and lived there.ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.

18 Isaac dug again the wells of water, which they had dug in the days of Abraham his father. For the Philistines had stopped them after the death of Abraham. He called their names after the names by which his father had called them.అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రా హాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన

19 Isaac's servants dug in the valley, and found there a well of springing water.మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

20 The herdsmen of Gerar argued with Isaac's herdsmen, saying, "The water is ours." He called the name of the well Esek, because they contended with him.అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.

21 They dug another well, and they argued over that, also. He called the name of it Sitnah.వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

22 He left that place, and dug another well. They didn't argue over that one. He called it Rehoboth. He said, "For now Yahweh has made room for us, and we will be fruitful in the land."అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడుఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశ మంద

23 He went up from there to Beersheba.అక్కడనుండి అతడు బెయేర్షెబాకు వెళ్లెను.

24 Yahweh appeared to him the same night, and said, "I am the God of Abraham your father. Don't be afraid, for I am with you, and will bless you, and multiply your seed for my servant Abraham's sake."ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.

25 He built an altar there, and called on the name of Yahweh, and pitched his tent there. There Isaac's servants dug a well.అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.

26 Then Abimelech went to him from Gerar, and Ahuzzath his friend, and Phicol the captain of his host.అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.

27 Isaac said to them, "Why have you come to me, since you hate me, and have sent me away from you?"ఇస్సాకుమీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

28 They said, "We saw plainly that Yahweh was with you. We said, 'Let there now be an oath between us, even between us and you, and let us make a covenant with you,వారు నిశ్చ యముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు

29 that you will do us no harm, as we have not touched you, and as we have done to you nothing but good, and have sent you away in peace.' You are now the blessed of Yahweh."మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధనచేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.

30 He made them a feast, and they ate and drink.అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

31 They rose up some time in the morning, and swore one to another. Isaac sent them away, and they departed from him in peace.తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగ నంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

32 It happened the same day, that Isaac's servants came, and told him concerning the well which they had dug, and said to him, "We have found water."ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసిమాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక

33 He called it Shibah.{Shibah means "oath" or "seven."} Therefore the name of the city is Beersheba{Beersheba means "well of the oath" or "well of the seven"} to this day.దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటివరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా.

34 When Esau was forty years old, he took as wife Judith, the daughter of Beeri the Hittite, and Basemath, the daughter of Elon the Hittite.ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయు డైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయు డైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసి కొనెను.

35 They grieved Isaac and Rebekah's spirits.వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

Telugu Bible