Genesis 11 - WEB (Telugu)
1 The whole earth was of one language and of one speech.భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.
2 It happened, as they traveled east, that they found a plain in the land of Shinar; and they lived there.వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి
3 They said one to another, "Come, let's make brick, and burn them thoroughly." They had brick for stone, and they used tar for mortar.మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.
4 They said, "Come, let's build us a city, and a tower, whose top reaches to the sky, and let's make us a name; lest we be scattered abroad on the surface of the whole earth."మరియు వారుమనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా
5 Yahweh came down to see the city and the tower, which the children of men built.యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.
6 Yahweh said, "Behold, they are one people, and they have all one language; and this is what they begin to do. Now nothing will be withheld from them, which they intend to do.అప్పుడు యెహోవాఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించి యున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండద
7 Come, let's go down, and there confuse their language, that they may not understand one another's speech."గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.
8 So Yahweh scattered them abroad from there on the surface of all the earth. They stopped building the city.ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.
9 Therefore the name of it was called Babel, because Yahweh confused the language of all the earth, there. From there, Yahweh scattered them abroad on the surface of all the earth.దానికి బాబెలు అను పేరు పెట్టిరి; ఎందు కనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదరగొట్టెను.
10 This is the history of the generations of Shem. Shem was one hundred years old, and became the father of Arpachshad two years after the flood.షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.
11 Shem lived after he became the father of Arpachshad five hundred years, and became the father of sons and daughters.షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
12 Arpachshad lived thirty-five years, and became the father of Shelah.అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
13 Arpachshad lived after he became the father of Shelah four hundred three years, and became the father of sons and daughters.అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
14 Shelah lived thirty years, and became the father of Eber:షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
15 and Shelah lived after he became the father of Eber four hundred three years, and became the father of sons and daughters.షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
16 Eber lived thirty-four years, and became the father of Peleg.ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.
17 Eber lived after he became the father of Peleg four hundred thirty years, and became the father of sons and daughters.ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
18 Peleg lived thirty years, and became the father of Reu.పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.
19 Peleg lived after he became the father of Reu two hundred nine years, and became the father of sons and daughters.పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
20 Reu lived thirty-two years, and became the father of Serug.రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.
21 Reu lived after he became the father of Serug two hundred seven years, and became the father of sons and daughters.రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
22 Serug lived thirty years, and became the father of Nahor.సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.
23 Serug lived after he became the father of Nahor two hundred years, and became the father of sons and daughters.సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
24 Nahor lived twenty-nine years, and became the father of Terah.నాహోరు ఇరువది తొమి్మది యేండ్లు బ్రదికి తెరహును కనెను.
25 Nahor lived after he became the father of Terah one hundred nineteen years, and became the father of sons and daughters.నాహోరు తెరహును కనినతరు వాత నూటపం దొమి్మది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
26 Terah lived seventy years, and became the father of Abram, Nahor, and Haran.తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహో రును హారానును కనెను.
27 Now this is the history of the generations of Terah. Terah became the father of Abram, Nahor, and Haran. Haran became the father of Lot.తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహో రును హారానును కనెను. హారాను లోతును కనెను.
28 Haran died before his father Terah in the land of his birth, in Ur of the Chaldees.హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణ ములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.
29 Abram and Nahor took wives. The name of Abram's wife was Sarai, and the name of Nahor's wife, Milcah, the daughter of Haran who was also the father of Iscah.అబ్రామును నాహోరును వివాహము చేసి కొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.
30 Sarai was barren. She had no child.శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.
31 Terah took Abram his son, Lot the son of Haran, his son's son, and Sarai his daughter-in-law, his son Abram's wife. They went forth from Ur of the Chaldees, to go into the land of Canaan. They came to Haran, and lived there.తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.
32 The days of Terah were two hundred five years. Terah died in Haran.తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.
Telugu Bible