Bible

Proverbs 5 - KJV (Telugu)

1 My son, attend unto my wisdom, and bow thine ear to my understanding:నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము

2 That thou mayest regard discretion, and that thy lips may keep knowledge.అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.

3 For the lips of a strange woman drop as an honeycomb, and her mouth is smoother than oil:జారస్త్రీ పెదవులనుండి తేనె కారును దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి

4 But her end is bitter as wormwood, sharp as a two-edged sword.దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,

5 Her feet go down to death; her steps take hold on hell.దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును

6 Lest thou shouldest ponder the path of life, her ways are moveable, that thou canst not know them.అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు తిరుగును.

7 Hear me now therefore, O ye children, and depart not from the words of my mouth.కుమారులారా, నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.

8 Remove thy way far from her, and come not nigh the door of her house:జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.

9 Lest thou give thine honour unto others, and thy years unto the cruel:వెళ్లినయెడల పరులకు నీ ¸°వనబలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు

10 Lest strangers be filled with thy wealth; and thy labours be in the house of a stranger;నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.

11 And thou mourn at the last, when thy flesh and thy body are consumed,తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు

12 And say, How have I hated instruction, and my heart despised reproof;అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని? నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?

13 And have not obeyed the voice of my teachers, nor inclined mine ear to them that instructed me!నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు

14 I was almost in all evil in the midst of the congregation and assembly.నేను సమాజ సంఘముల మధ్యనుండినను ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు గుచు నుందువు.

15 Drink waters out of thine own cistern, and running waters out of thine own well.నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.

16 Let thy fountains be dispersed abroad, and rivers of waters in the streets.నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?

17 Let them be only thine own, and not strangers' with thee.అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.

18 Let thy fountain be blessed: and rejoice with the wife of thy youth.నీ ఊట దీవెన నొందును. నీ ¸°వనకాలపు భార్యయందు సంతోషింపుము.

19 Let her be as the loving hind and pleasant roe; let her breasts satisfy thee at all times; and be thou ravished always with her love.ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.

20 And why wilt thou, my son, be ravished with a strange woman, and embrace the bosom of a stranger?నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై యుందువు? పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?

21 For the ways of man are before the eyes of the LORD, and he pondereth all his goings.నరుని మార్గములను యెహోవా యెరుగును వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.

22 His own iniquities shall take the wicked himself, and he shall be holden with the cords of his sins.దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును.

23 He shall die without instruction; and in the greatness of his folly he shall go astray.శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.

Telugu Bible