Amos 1 - WEB (Telugu)
1 The words of Amos, who was among the herdsmen of Tekoa, which he saw concerning Israel in the days of Uzziah king of Judah, and in the days of Jeroboam the son of Joash king of Israel, two years before the earthquake.యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దిన ములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.
2 He said: "Yahweh will roar from Zion, And utter his voice from Jerusalem; And the pastures of the shepherds will mourn, And the top of Carmel will wither."అతడు ప్రకటించినదేమనగాయెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.
3 Thus says Yahweh: "For three transgressions of Damascus, yes, for four, I will not turn away its punishment; Because they have threshed Gilead with threshing instruments of iron;యెహోవా సెలవిచ్చునదేమనగాదమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.
4 But I will send a fire into the house of Hazael, And it will devour the palaces of Ben Hadad.నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;
5 I will break the bar of Damascus, And cut off the inhabitant from the valley of Aven, And him who holds the scepter from the house of Eden; And the people of Syria shall go into captivity to Kir," says Yahweh.దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసు లను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
6 Thus says Yahweh: "For three transgressions of Gaza, yes, for four, I will not turn away its punishment; Because they carried away captive the whole community, To deliver them up to Edom;యెహోవా సెలవిచ్చునదేమనగాగాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.
7 But I will send a fire on the wall of Gaza, And it will devour its palaces.గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;
8 I will cut off the inhabitant from Ashdod, And him who holds the scepter from Ashkelon; And I will turn my hand against Ekron; And the remnant of the Philistines will perish," says the Lord Yahweh.అష్డోదులో నివాసు లను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
9 Thus says Yahweh: "For three transgressions of Tyre, yes, for four, I will not turn away its punishment; Because they delivered up the whole community to Edom, And didn't remember the brotherly covenant;యెహోవా సెలవిచ్చునదేమనగాతూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహో దర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
10 But I will send a fire on the wall of Tyre, And it will devour its palaces."నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.
11 Thus says Yahweh: "For three transgressions of Edom, yes, for four, I will not turn away its punishment; Because he pursued his brother with the sword, And cast off all pity, And his anger raged continually, And he kept his wrath forever;యెహోవా సెలవిచ్చునదేమనగాఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.
12 But I will send a fire on Teman, And it will devour the palaces of Bozrah."తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరు లను దహించివేయును.
13 Thus says Yahweh: "For three transgressions of the children of Ammon, yes, for four, I will not turn away its punishment; Because they have ripped open the pregnant women of Gilead, That they may enlarge their border.యెహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరి హద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.
14 But I will kindle a fire in the wall of Rabbah, And it will devour its palaces, With shouting in the day of battle, With a tempest in the day of the whirlwind;రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడి గాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును.
15 And their king will go into captivity, He and his princes together," says Yahweh.వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొని పోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Telugu Bible