Bible

Acts 5 - YLT (Telugu)

1 And a certain man, Ananias by name, with Sapphira his wife, sold a possession,అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

2 and did keep back of the price -- his wife also knowing -- and having brought a certain part, at the feet of the apostles he laid `it'.భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

3 And Peter said, `Ananias, wherefore did the Adversary fill thy heart, for thee to lie to the Holy Spirit, and to keep back of the price of the place?అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయ మును ప్రేరేపించెను.?

4 while it remained, did it not remain thine? and having been sold, in thy authority was it not? why `is' it that thou didst put in thy heart this thing? thou didst not lie to men, but to God;'అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమి్మన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమా

5 and Ananias hearing these words, having fallen down, did expire, and great fear came upon all who heard these things,అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;

6 and having risen, the younger men wound him up, and having carried forth, they buried `him'.అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

7 And it came to pass, about three hours after, that his wife, not knowing what hath happened, came in,ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

8 and Peter answered her, `Tell me if for so much ye sold the place;' and she said, `Yes, for so much.'అప్పుడు పేతురుమీరు ఆ భూమిని ఇంతకే అమి్మతిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

9 And Peter said unto her, `How was it agreed by you, to tempt the Spirit of the Lord? lo, the feet of those who did bury thy husband `are' at the door, and they shall carry thee forth;'అందుకు పేతురుప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ

10 and she fell down presently at his feet, and expired, and the young men having come in, found her dead, and having carried forth, they buried `her' by her husband;వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

11 and great fear came upon all the assembly, and upon all who heard these things.సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.

12 And through the hands of the apostles came many signs and wonders among the people, and they were with one accord all in the porch of Solomon;ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి.

13 and of the rest no one was daring to join himself to them, but the people were magnifying them,కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని

14 (and the more were believers added to the Lord, multitudes both of men and women,)ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.

15 so as into the broad places to bring forth the ailing, and to lay `them' upon couches and mats, that at the coming of Peter, even `his' shadow might overshadow some one of them;అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.

16 and there were coming together also the people of the cities round about to Jerusalem, bearing ailing persons, and those harassed by unclean spirits -- who were all healed.మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

17 And having risen, the chief priest, and all those with him -- being the sect of the Sadducees -- were filled with zeal,ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారంద రును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని

18 and laid their hands upon the apostles, and did put them in a public prison;అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.

19 and a messenger of the Lord through the night opened the doors of the prison, having also brought them forth, he said,అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి

20 `Go on, and standing, speak in the temple to the people all the sayings of this life;'ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

21 and having heard, they did enter at the dawn into the temple, and were teaching. And the chief priest having come, and those with him, they called together the sanhedrim and all the senate of the sons of Israel, and they sent to the prison to have them brought,వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.

22 and the officers having come, did not find them in the prison, and having turned back, they told,బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెర సాలలో కనబడనందున తిరిగివచ్చి

23 saying -- `The prison indeed we found shut in all safety, and the keepers standing without before the doors, and having opened -- within we found no one.'చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.

24 And as the priest, and the magistrate of the temple, and the chief priests, heard these words, they were doubting concerning them to what this would come;అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

25 and coming near, a certain one told them, saying -- `Lo, the men whom ye did put in the prison are in the temple standing and teaching the people;'అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా

26 then the magistrate having gone away with officers, brought them without violence, for they were fearing the people, lest they should be stoned;అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.

27 and having brought them, they set `them' in the sanhedrim, and the chief priest questioned them,వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా

28 saying, `Did not we strictly command you not to teach in this name? and lo, ye have filled Jerusalem with your teaching, and ye intend to bring upon us the blood of this man.'ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.

29 And Peter and the apostles answering, said, `To obey God it behoveth, rather than men;అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

30 and the God of our fathers did raise up Jesus, whom ye slew, having hanged upon a tree;మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.

31 this one God, a Prince and a Saviour, hath exalted with His right hand, to give reformation to Israel, and forgiveness of sins;ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.

32 and we are His witnesses of these sayings, and the Holy Spirit also, whom God gave to those obeying him.'మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

33 And they having heard, were cut `to the heart', and were taking counsel to slay them,వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా

34 but a certain one, having risen up in the sanhedrim -- a Pharisee, by name Gamaliel, a teacher of law honoured by all the people -- commanded to put the apostles forth a little,సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచిఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

35 and said unto them, `Men, Israelites, take heed to yourselves about these men, what ye are about to do,ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.

36 for before these days rose up Theudas, saying, that himself was some one, to whom a number of men did join themselves, as it were four hundred, who was slain, and all, as many as were obeying him, were scattered, and came to nought.ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.

37 `After this one rose up, Judas the Galilean, in the days of the enrollment, and drew away much people after him, and that one perished, and all, as many as were obeying him, were scattered;వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.

38 and now I say to you, Refrain from these men, and let them alone, because if this counsel or this work may be of men, it will be overthrown,కాబట్టి నేను మీతో చెప్పునదేమనగాఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలో చనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును.

39 and if it be of God, ye are not able to overthrow it, lest perhaps also ye be found fighting against God.'దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

40 And to him they agreed, and having called near the apostles, having beaten `them', they commanded `them' not to speak in the name of Jesus, and let them go;వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామ మునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

41 they, indeed, then, departed from the presence of the sanhedrim, rejoicing that for his name they were counted worthy to suffer dishonour,ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

42 every day also in the temple, and in every house, they were not ceasing teaching and proclaiming good news -- Jesus the Christ.ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

Telugu Bible