2 Timothy 2 - ASV (Telugu)
1 Thou therefore, my child, be strengthened in the grace that is in Christ Jesus.నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
2 And the things which thou hast heard from me among many witnesses, the same commit thou to faithful men, who shall be able to teach others also.నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,
3 Suffer hardship with `me', as a good soldier of Christ Jesus.క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
4 No soldier on service entangleth himself in the affairs of `this' life; that he may please him who enrolled him as a soldier.సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు.
5 And if also a man contend in the games, he is not crowded, except he have contended lawfully.మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు, నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
6 The husbandmen that laboreth must be the first to partake of the fruits.పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫల ములలో పాలు పుచ్చుకొనవలసినవాడు.
7 Consider what I say; for the Lord shall give thee understanding in all things.నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమను గ్రహించును.
8 Remember Jesus Christ, risen from the dead, of the seed of David, according to my gospel:నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము.
9 wherein I suffer hardship unto bonds, as a malefactor; but the word of God is not bound.నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.
10 Therefore I endure all things for the elect's sake, that they also may obtain the salvation which is in Christ Jesus with eternal glory.అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
11 Faithful is the saying: For if we died with him, we shall also live with him:ఈ మాట నమ్మదగినది, ఏదనగామన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.
12 if we endure, we shall also reign with him: if we shall deny him, he also will deny us:సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
13 if we are faithless, he abideth faithful; for he cannot deny himself.మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
14 Of these things put them in remembrance, charging `them' in the sight of the Lord, that they strive not about words, to no profit, to the subverting of them that hear.వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
15 Give diligence to present thyself approved unto God, a workman that needeth not to be ashamed, handling aright the word of truth.దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను3 నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
16 But shun profane babblings: for they will proceed further in ungodliness,అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.
17 and their word will eat as doth a gangrene: or whom is Hymenaeus an Philetus;కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
18 men who concerning the truth have erred, saying that the resurrection is past already, and overthrow the faith of some.వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాస మును చెరుపుచున్నారు.
19 Howbeit the firm foundation of God standeth, having this seal, The Lord knoweth them that are his: and, Let every one that nameth the name of the Lord depart from unrighteousness.అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది.ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునది
20 Now in a great house there are not only vessels of gold and of silver, but also of wood and of earth; and some unto honor, and some unto dishonor.గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును.
21 If a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified, meet for the master's use, prepared unto every good work.ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
22 after righteousness, faith, love, pace, with them that call on the Lord out of a pure heart.నీవు ¸°వనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
23 But foolish and ignorant questionings refuse, knowing that they gender strifes.నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
24 And the Lord's servant must not strive, but be gentle towards all, apt to teach, forbearing,సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును;
25 in meekness correcting them that oppose themselves; if peradventure God may give them repentance unto the knowledge of the truth,అందువలన సాతాను తన యిష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని,
26 and they may recover themselves out of the snare of the devil, having been taken captive by him unto his will.ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
Telugu Bible