Bible

1 Timothy 2 - BBE (Telugu)

1 My desire is, first of all, that you will make requests and prayers and give praise for all men;మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును

2 For kings and all those in authority; so that we may have a calm and quiet life in all fear of God and serious behaviour.రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చ రించుచున్నాను.

3 This is good and pleasing in the eyes of God our Saviour;ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.

4 Whose desire is that all men may have salvation and come to the knowledge of what is true.ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.

5 For there is one God and one peacemaker between God and men, the man Christ Jesus,దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు.

6 Who gave himself as an offering for all; witness of which was to be given at the right time;ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

7 And of this I became a preacher and an Apostle (what I say is true, not false,) and a teacher of the Gentiles in the true faith.ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.

8 It is my desire, then, that in every place men may give themselves to prayer, lifting up holy hands, without wrath or argument.కావున ప్రతిస్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను.

9 And that women may be dressed in simple clothing, with a quiet and serious air; not with twisted hair and gold or jewels or robes of great price;మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్య ములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలం కరించుకొనక,

10 But clothed with good works, as is right for women who are living in the fear of God.దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించు కొనవలెను.

11 Let a woman quietly take the place of a learner and be under authority.స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధే యతతో నేర్చుకొనవలెను.

12 In my opinion it is right for a woman not to be a teacher, or to have rule over a man, but to be quiet.స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధి కారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

13 For Adam was first formed, then Eve;మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?

14 And Adam was not taken by deceit, but the woman, being tricked, became a wrongdoer.మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను.

15 But if they go on in faith and love and holy self-control, she will be kept safe at the time of childbirth.అయినను వారు స్వస్థబుద్ధికలిగి, విశ్వాసప్రేమ పరిశుద్ధతలయందు నిలు కడగా ఉండినయెడల శిశుప్రసూతిద్వారా ఆమె రక్షింప బడును.

Telugu Bible