1 Samuel 23 - WEB (Telugu)
1 They told David, saying, Behold, the Philistines are fighting against Keilah, and are robbing the threshing floors.తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కల్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.
2 Therefore David inquired of Yahweh, saying, Shall I go and strike these Philistines? Yahweh said to David, Go, and strike the Philistines, and save Keilah.అంతట దావీదునేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవానీవు వెళ్లి ఫిలిష్తీ యులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.
3 David's men said to him, Behold, we are afraid here in Judah: how much more then if we go to Keilah against the armies of the Philistines?దావీదుతో కూడియున్న జనులుమేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా
4 Then David inquired of Yahweh yet again. Yahweh answered him, and said, Arise, go down to Keilah; for I will deliver the Philistines into your hand.దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెనునీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా
5 David and his men went to Keilah, and fought with the Philistines, and brought away their cattle, and killed them with a great slaughter. So David saved the inhabitants of Keilah.దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను.
6 It happened, when Abiathar the son of Ahimelech fled to David to Keilah, that he came down with an ephod in his hand.అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.
7 It was told Saul that David was come to Keilah. Saul said, God has delivered him into my hand; for he is shut in, by entering into a town that has gates and bars.దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించెనను కొనెను.
8 Saul summoned all the people to war, to go down to Keilah, to besiege David and his men.కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింప వలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.
9 David knew that Saul was devising mischief against him; and he said to Abiathar the priest, Bring here the ephod.సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.
10 Then said David, O Yahweh, the God of Israel, your servant has surely heard that Saul seeks to come to Keilah, to destroy the city for my sake.అప్పుడు దావీదుఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడుచేయ నుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకురూఢిగా తెలియబడి యున్నది.
11 Will the men of Keilah deliver me up into his hand? will Saul come down, as your servant has heard? Yahweh, the God of Israel, I beg you, tell your servant. Yahweh said, He will come down.కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.
12 Then said David, Will the men of Keilah deliver up to me and my men into the hand of Saul? Yahweh said, They will deliver you up.కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవి చేయగా యెహోవావారు నిన్ను అప్ప గించుదురని సెలవిచ్చెను.
13 Then David and his men, who were about six hundred, arose and departed out of Keilah, and went wherever they could go. It was told Saul that David was escaped from Keilah; and he gave up going there.అంతట దావీదును దాదాపు ఆరువందల మందియైన అతని జనులును లేచి కెయీలాలో నుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.
14 David abode in the wilderness in the strongholds, and remained in the hill-country in the wilderness of Ziph. Saul sought him every day, but God didn't deliver him into his hand.అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.
15 David saw that Saul had come out to seek his life: and David was in the wilderness of Ziph in the wood.తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.
16 Jonathan, Saul's son, arose, and went to David into the wood, and strengthened his hand in God.అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చినా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు,
17 He said to him, Don't be afraid; for the hand of Saul my father shall not find you; and you shall be king over Israel, and I shall be next to you; and that also Saul my father knows.నీవు ఇశ్రా యేలీయులకు రాజ వగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రి యైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.
18 They two made a covenant before Yahweh: and David abode in the wood, and Jonathan went to his house.వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.
19 Then came up the Ziphites to Saul to Gibeah, saying, Doesn't David hide himself with us in the strongholds in the wood, in the hill of Hachilah, which is on the south of the desert?జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చియెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.
20 Now therefore, O king, come down, according to all the desire of your soul to come down; and our part shall be to deliver him up into the king's hand.రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా
21 Saul said, Blessed be you of Yahweh; for you have had compassion on me.సౌలు వారితో ఇట్లనెనుమీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.
22 Please go make yet more sure, and know and see his place where his haunt is, [and] who has seen him there; for it is told me that he deals very subtly.మీరు పోయి అతడు ఉండుస్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక
23 See therefore, and take knowledge of all the lurking-places where he hides himself, and come you again to me of a certainty, and I will go with you: and it shall happen, if he be in the land, that I will search him out among all the thousands of Judah.మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతియంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.
24 They arose, and went to Ziph before Saul: but David and his men were in the wilderness of Maon, in the Arabah on the south of the desert.అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా
25 Saul and his men went to seek him. They told David: why he came down to the rock, and abode in the wilderness of Maon. When Saul heard [that], he pursued after David in the wilderness of Maon.సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.
26 Saul went on this side of the mountain, and David and his men on that side of the mountain: and David made haste to get away for fear of Saul; for Saul and his men compassed David and his men round about to take them.అయితే సౌలు పర్వతము ఈ తట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆ తట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టు కొనుచుండిరి.
27 But there came a messenger to Saul, saying, Haste you, and come; for the Philistines have made a raid on the land.ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చినీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా
28 So Saul returned from pursuing after David, and went against the Philistines: therefore they called that place Sela Hammahlekoth.సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు1 అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను.
29 David went up from there, and lived in the strongholds of En Gedi.తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.
Telugu Bible