కీర్తనల గ్రంథము 4
1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
2 నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?
3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
4 భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి
6 మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
7 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.
8 యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.
1 To the chief Musician on Neginoth, A Psalm of David.
2 Hear me when I call, O God of my righteousness: thou hast enlarged me when I was in distress; have mercy upon me, and hear my prayer.
3 O ye sons of men, how long will ye turn my glory into shame? how long will ye love vanity, and seek after leasing? Selah.
4 But know that the Lord hath set apart him that is godly for himself: the Lord will hear when I call unto him.
5 Stand in awe, and sin not: commune with your own heart upon your bed, and be still. Selah.
6 Offer the sacrifices of righteousness, and put your trust in the Lord.
7 There be many that say, Who will shew us any good? Lord, lift thou up the light of thy countenance upon us.
8 Thou hast put gladness in my heart, more than in the time that their corn and their wine increased.
9 I will both lay me down in peace, and sleep: for thou, Lord, only makest me dwell in safety.