Jeremiah 6:30
యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.
Jeremiah 6:30 in Other Translations
King James Version (KJV)
Reprobate silver shall men call them, because the LORD hath rejected them.
American Standard Version (ASV)
Refuse silver shall men them, because Jehovah hath rejected them.
Bible in Basic English (BBE)
They will be named waste silver, because the Lord has given them up.
Darby English Bible (DBY)
Reprobate silver shall they call them, for Jehovah hath rejected them.
World English Bible (WEB)
Refuse silver shall men them, because Yahweh has rejected them.
Young's Literal Translation (YLT)
`Silver rejected,' they have called to them, For Jehovah hath kicked against them!
| Reprobate | כֶּ֣סֶף | kesep | KEH-sef |
| silver | נִמְאָ֔ס | nimʾās | neem-AS |
| shall men call | קָרְא֖וּ | qorʾû | kore-OO |
| because them, | לָהֶ֑ם | lāhem | la-HEM |
| the Lord | כִּֽי | kî | kee |
| hath rejected | מָאַ֥ס | māʾas | ma-AS |
| them. | יְהוָ֖ה | yĕhwâ | yeh-VA |
| בָּהֶֽם׃ | bāhem | ba-HEM |
Cross Reference
హొషేయ 9:17
వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.
యెషయా గ్రంథము 1:22
నీ వెండి మష్టాయెను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను.
కీర్తనల గ్రంథము 119:119
భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి
రోమీయులకు 11:1
ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తనప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేనుకూడ ఇశ్రాయేలీ యుడను, అబ్రాహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.
మత్తయి సువార్త 5:13
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
యెహెజ్కేలు 22:18
నరపుత్రుడా, ఇశ్రాయేలీ యులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమి లోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.
విలాపవాక్యములు 5:22
నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.
యిర్మీయా 14:19
నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.
యిర్మీయా 7:29
తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.
యెషయా గ్రంథము 1:25
నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.
సామెతలు 25:4
వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.