యిర్మీయా 47:6 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యిర్మీయా యిర్మీయా 47 యిర్మీయా 47:6

Jeremiah 47:6
​​యెహోవా ఖడ్గమా, యెంత వరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్ర మించి ఊరకుండుము.

Jeremiah 47:5Jeremiah 47Jeremiah 47:7

Jeremiah 47:6 in Other Translations

King James Version (KJV)
O thou sword of the LORD, how long will it be ere thou be quiet? put up thyself into thy scabbard, rest, and be still.

American Standard Version (ASV)
O thou sword of Jehovah, how long will it be ere thou be quiet? put up thyself into thy scabbard; rest, and be still.

Bible in Basic English (BBE)
O sword of the Lord, how long will you have no rest? put yourself back into your cover; be at peace, be quiet.

Darby English Bible (DBY)
Alas! sword of Jehovah, how long wilt thou not be quiet? Withdraw into thy scabbard, rest, and be still.

World English Bible (WEB)
You sword of Yahweh, how long will it be before you be quiet? put up yourself into your scabbard; rest, and be still.

Young's Literal Translation (YLT)
Ho, sword of Jehovah, till when art thou not quiet? Be removed unto thy sheath, rest and cease.

O
ה֗וֹיhôyhoy
thou
sword
חֶ֚רֶבḥerebHEH-rev
of
the
Lord,
לַֽיהוָ֔הlayhwâlai-VA
long
how
עַדʿadad

אָ֖נָהʾānâAH-na
will
it
be
ere
לֹ֣אlōʾloh
quiet?
be
thou
תִשְׁקֹ֑טִיtišqōṭîteesh-KOH-tee
put
up
thyself
הֵאָֽסְפִי֙hēʾāsĕpiyhay-ah-seh-FEE
into
אַלʾalal
scabbard,
thy
תַּעְרֵ֔ךְtaʿrēkta-RAKE
rest,
הֵרָגְעִ֖יhērogʿîhay-roɡe-EE
and
be
still.
וָדֹֽמִּי׃wādōmmîva-DOH-mee

Cross Reference

యెహెజ్కేలు 21:3
యెహోవా సెలవిచ్చునదేమనగానేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.

యిర్మీయా 12:12
పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.

యోహాను సువార్త 18:11
ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

యెహెజ్కేలు 21:30
ఖడ్గమును ఒరలోవేయుము; నీవు సృష్టింప బడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును.

యెహెజ్కేలు 14:17
నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచినీవు ఈ దేశమునందు సంచరించి మను ష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల

యిర్మీయా 51:20
నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను.

యిర్మీయా 25:27
నీవు వారితో ఈలాగు చెప్పుముఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనే యుండి మీరు మరల లేవకుండ పడు దురు.

యిర్మీయా 15:3
యెహోవా వాక్కు ఇదేచంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.

యిర్మీయా 12:4
భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవు చున్నవి.

యిర్మీయా 4:21
​నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను?

యెషయా గ్రంథము 10:15
గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువానిమీద పొగడుకొనునా? కోల తన్నెత్తువానిని ఆడించినట్లును దండము కఱ్ఱకానివానిని ఎత్తినట్లును ఉండును గదా?

యెషయా గ్రంథము 10:5
అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది.

కీర్తనల గ్రంథము 17:13
యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21:27
​యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

సమూయేలు రెండవ గ్రంథము 2:26
​అబ్నేరు కేకవేసికత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.

ద్వితీయోపదేశకాండమ 32:41
నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.