Hosea 4:8
నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.
Hosea 4:8 in Other Translations
King James Version (KJV)
They eat up the sin of my people, and they set their heart on their iniquity.
American Standard Version (ASV)
They feed on the sin of my people, and set their heart on their iniquity.
Bible in Basic English (BBE)
The sin of my people is like food to them; and their desire is for their wrongdoing.
Darby English Bible (DBY)
They eat the sin of my people, and their soul longeth for their iniquity.
World English Bible (WEB)
They feed on the sin of my people, And set their heart on their iniquity.
Young's Literal Translation (YLT)
The sin of My people they do eat, And unto their iniquity lift up their soul.
| They eat up | חַטַּ֥את | ḥaṭṭat | ha-TAHT |
| the sin | עַמִּ֖י | ʿammî | ah-MEE |
| of my people, | יֹאכֵ֑לוּ | yōʾkēlû | yoh-HAY-loo |
| set they and | וְאֶל | wĕʾel | veh-EL |
| their heart | עֲוֹנָ֖ם | ʿăwōnām | uh-oh-NAHM |
| on | יִשְׂא֥וּ | yiśʾû | yees-OO |
| their iniquity. | נַפְשֽׁוֹ׃ | napšô | nahf-SHOH |
Cross Reference
మీకా 3:11
జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
యెషయా గ్రంథము 56:11
కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచా రించుకొందురు.
లేవీయకాండము 6:26
పాపపరిహారార్థ బలిగా దాని నర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరి శుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
తీతుకు 1:11
వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉప దేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.
రోమీయులకు 16:18
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
మలాకీ 1:10
మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్య మును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
లేవీయకాండము 7:6
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
యెహెజ్కేలు 14:7
ఇశ్రా యేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశుల లోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.
యెహెజ్కేలు 14:3
నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృద యములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?
కీర్తనల గ్రంథము 25:1
యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
కీర్తనల గ్రంథము 24:4
వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
సమూయేలు మొదటి గ్రంథము 2:29
నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.
2 పేతురు 2:3
వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.