Exodus 20:16
నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
Exodus 20:16 in Other Translations
King James Version (KJV)
Thou shalt not bear false witness against thy neighbor.
American Standard Version (ASV)
Thou shalt not bear false witness against thy neighbor.
Bible in Basic English (BBE)
Do not give false witness against your neighbour.
Darby English Bible (DBY)
Thou shalt not bear false witness against thy neighbour.
Webster's Bible (WBT)
Thou shalt not bear false witness against thy neighbor.
World English Bible (WEB)
"You shall not give false testimony against your neighbor.
Young's Literal Translation (YLT)
`Thou dost not answer against thy neighbour a false testimony.
| Thou shalt not | לֹֽא | lōʾ | loh |
| bear | תַעֲנֶ֥ה | taʿăne | ta-uh-NEH |
| false | בְרֵֽעֲךָ֖ | bĕrēʿăkā | veh-ray-uh-HA |
| witness | עֵ֥ד | ʿēd | ade |
| against thy neighbour. | שָֽׁקֶר׃ | šāqer | SHA-ker |
Cross Reference
మత్తయి సువార్త 19:18
యేసునరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము,
సామెతలు 19:5
కూటసాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
కీర్తనల గ్రంథము 15:3
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడుతన పొరుగువానిమీద నింద మోపడు
మత్తయి సువార్త 26:59
ప్రధానయాజకు లును, మహా సభవారందరును, యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధసాక్ష్యము వెదకుచుండిరి కాని
కీర్తనల గ్రంథము 101:5
తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
నిర్గమకాండము 23:1
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్య మును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
యాకోబు 4:11
సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
2 తిమోతికి 3:3
అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు
1 తిమోతికి 1:10
హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
ఎఫెసీయులకు 4:31
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
అపొస్తలుల కార్యములు 6:13
అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారుఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మ శాస్త్రమునకును విరోధముగా వ
సామెతలు 11:13
కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును.
సామెతలు 10:18
అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
రాజులు మొదటి గ్రంథము 21:10
నీవు దేవునిని రాజును దూషించితివని అతనిమీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన యిద్దరు మనుష్యులను సిద్ధపరచుడి; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొని పోయి రాళ్లతో చావగొట్టుడి.
సమూయేలు మొదటి గ్రంథము 22:8
మీరెందుకు నామీద కుట్రచేయు చున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.
ద్వితీయోపదేశకాండమ 19:15
ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
లేవీయకాండము 19:16
నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
లేవీయకాండము 19:11
నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;
నిర్గమకాండము 23:6
దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు