దానియేలు 5:6 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దానియేలు దానియేలు 5 దానియేలు 5:6

Daniel 5:6
అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను.

Daniel 5:5Daniel 5Daniel 5:7

Daniel 5:6 in Other Translations

King James Version (KJV)
Then the king's countenance was changed, and his thoughts troubled him, so that the joints of his loins were loosed, and his knees smote one against another.

American Standard Version (ASV)
Then the king's countenance was changed in him, and his thoughts troubled him; and the joints of his loins were loosed, and his knees smote one against another.

Bible in Basic English (BBE)
Then the colour went from the king's face, and he was troubled by his thoughts; strength went from his body, and his knees were shaking.

Darby English Bible (DBY)
Then the king's countenance was changed, and his thoughts troubled him, and the joints of his loins were loosed, and his knees smote one against another.

World English Bible (WEB)
Then the king's face was changed in him, and his thoughts troubled him; and the joints of his loins were loosened, and his knees struck one against another.

Young's Literal Translation (YLT)
then the king's countenance hath changed, and his thoughts do trouble him, and the joints of his loins are loosed, and his knees are smiting one against another.

Then
אֱדַ֤יִןʾĕdayinay-DA-yeen
the
king's
מַלְכָּא֙malkāʾmahl-KA
countenance
זִיוֺ֣הִיzîwōhîzeeoo-OH-hee
was
changed,
שְׁנ֔וֹהִיšĕnôhîsheh-NOH-hee
thoughts
his
and
וְרַעיֹנֹ֖הִיwĕraʿyōnōhîveh-ra-yoh-NOH-hee
troubled
יְבַהֲלוּנֵּ֑הּyĕbahălûnnēhyeh-va-huh-loo-NAY
joints
the
that
so
him,
וְקִטְרֵ֤יwĕqiṭrêveh-keet-RAY
of
his
loins
חַרְצֵהּ֙ḥarṣēhhahr-TSAY
were
loosed,
מִשְׁתָּרַ֔יִןmištārayinmeesh-ta-RA-yeen
knees
his
and
וְאַ֨רְכֻבָּתֵ֔הּwĕʾarkubbātēhveh-AR-hoo-ba-TAY
smote
דָּ֥אdāʾda
one
לְדָ֖אlĕdāʾleh-DA
against
another.
נָֽקְשָֽׁן׃nāqĕšānNA-keh-SHAHN

Cross Reference

నహూము 2:10
అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.

దానియేలు 7:28
దాని యేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.

యెహెజ్కేలు 7:17
​అందరిచేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్లవలె తత్తరిల్లును.

దానియేలు 4:5
​నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలం పులు నన్ను కలతపెట్టెను.

యెహెజ్కేలు 21:7
నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవుశ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడి నది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బల హీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.

కీర్తనల గ్రంథము 69:23
వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.

దానియేలు 5:9
అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధి పతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడా యెను.

దానియేలు 4:19
​అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తె షాజరునా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,

యెషయా గ్రంథము 13:7
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును

హెబ్రీయులకు 12:12
కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి.

దానియేలు 3:19
అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

దానియేలు 2:1
నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను.

యెషయా గ్రంథము 35:3
సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి.

యెషయా గ్రంథము 21:2
కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అను గ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

యెషయా గ్రంథము 5:27
వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

కీర్తనల గ్రంథము 73:18
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

యోబు గ్రంథము 20:19
వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.

యోబు గ్రంథము 15:20
తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందునుహింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడుబాధనొందును.