అపొస్తలుల కార్యములు 7:46 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ అపొస్తలుల కార్యములు అపొస్తలుల కార్యములు 7 అపొస్తలుల కార్యములు 7:46

Acts 7:46
అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.

Acts 7:45Acts 7Acts 7:47

Acts 7:46 in Other Translations

King James Version (KJV)
Who found favour before God, and desired to find a tabernacle for the God of Jacob.

American Standard Version (ASV)
who found favor in the sight of God, and asked to find a habitation for the God of Jacob.

Bible in Basic English (BBE)
Who was pleasing to God; and he had a desire to make a holy tent for the God of Jacob.

Darby English Bible (DBY)
who found favour before God, and asked to find a tabernacle for the God of Jacob;

World English Bible (WEB)
who found favor in the sight of God, and asked to find a habitation for the God of Jacob.

Young's Literal Translation (YLT)
who found favour before God, and requested to find a tabernacle for the God of Jacob;

Who
ὃςhosose
found
εὗρενheurenAVE-rane
favour
χάρινcharinHA-reen
before
ἐνώπιονenōpionane-OH-pee-one

τοῦtoutoo
God,
θεοῦtheouthay-OO
and
καὶkaikay
desired
ᾐτήσατοētēsatoay-TAY-sa-toh
find
to
εὑρεῖνheureinave-REEN
a
tabernacle
σκήνωμαskēnōmaSKAY-noh-ma
for
the
τῷtoh
God
Θεῷtheōthay-OH
of
Jacob.
Ἰακώβiakōbee-ah-KOVE

Cross Reference

అపొస్తలుల కార్యములు 13:22
తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

కీర్తనల గ్రంథము 132:1
యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:1
దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించినేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా

సమూయేలు రెండవ గ్రంథము 7:18
దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెనునా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నే నెంతటివాడను? నా కుటుంబము ఏ పాటిది?

సమూయేలు రెండవ గ్రంథము 7:8
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.

సమూయేలు రెండవ గ్రంథము 7:1
యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజుతన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి

సమూయేలు మొదటి గ్రంథము 16:1
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెల... విచ్చెనుఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖిం తువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.

కీర్తనల గ్రంథము 132:11
నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని

కీర్తనల గ్రంథము 89:19
అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.

కీర్తనల గ్రంథము 78:68
యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:2
నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండిపనికి వెండిని, యిత్తడిపనికి ఇత్తడిని, యినుపపనికి ఇనుమును, కఱ్ఱపనికి కఱ్ఱలను, గోమేధికపురాళ్లను, చెక్కుడురాళ్లను, వింతైన వర్ణములుగల పలువిధములరాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్లచలువరాయి విశేషముగా సంపాదించితిని.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:2
అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెనునా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి; యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమస్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించ వలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితిని.

దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22:7
మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెనునా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

రాజులు మొదటి గ్రంథము 8:17
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవ లెనని నా తండ్రియైన దావీదునకు మనస్సు పుట్టగా

సమూయేలు రెండవ గ్రంథము 6:21
నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రా యేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించు టకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని.

సమూయేలు మొదటి గ్రంథము 16:11
నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడుఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలునీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

సమూయేలు మొదటి గ్రంథము 15:28
అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెనునేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు.