దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:20 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17 దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17:20

1 Chronicles 17:20
​యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.

1 Chronicles 17:191 Chronicles 171 Chronicles 17:21

1 Chronicles 17:20 in Other Translations

King James Version (KJV)
O LORD, there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears.

American Standard Version (ASV)
O Jehovah, there is none like thee, neither is there any God besides thee, according to all that we have heard with our ears.

Bible in Basic English (BBE)
O Lord, there is no one like you, and no other God but you, as is clear from everything which has come to our ears.

Darby English Bible (DBY)
Jehovah, there is none like thee, neither is there any God beside thee, according to all that we have heard with our ears.

Webster's Bible (WBT)
O LORD, there is none like thee, neither is there any God besides thee, according to all that we have heard with our ears.

World English Bible (WEB)
Yahweh, there is none like you, neither is there any God besides you, according to all that we have heard with our ears.

Young's Literal Translation (YLT)
O Jehovah, there is none like Thee, and there is no god save Thee, according to all that we have heard with our ears.

O
Lord,
יְהוָה֙yĕhwāhyeh-VA
there
is
none
אֵ֣יןʾênane
thee,
like
כָּמ֔וֹךָkāmôkāka-MOH-ha
neither
וְאֵ֥יןwĕʾênveh-ANE
is
there
any
God
אֱלֹהִ֖יםʾĕlōhîmay-loh-HEEM
beside
זֽוּלָתֶ֑ךָzûlātekāzoo-la-TEH-ha
thee,
according
to
all
בְּכֹ֥לbĕkōlbeh-HOLE
that
אֲשֶׁרʾăšeruh-SHER
heard
have
we
שָׁמַ֖עְנוּšāmaʿnûsha-MA-noo
with
our
ears.
בְּאָזְנֵֽינוּ׃bĕʾoznênûbeh-oze-NAY-noo

Cross Reference

యెషయా గ్రంథము 44:6
ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు.

నిర్గమకాండము 15:11
యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు

యెషయా గ్రంథము 40:25
నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.

యెషయా గ్రంథము 43:10
మీరు తెలిసికొని నన్ను నమి్మ నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.

యెషయా గ్రంథము 45:5
నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.

యెషయా గ్రంథము 45:22
భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.

యెషయా గ్రంథము 63:12
తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి?

యిర్మీయా 10:6
యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘన మైనదాయెను.

ఎఫెసీయులకు 3:20
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

యెషయా గ్రంథము 40:18
కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?

కీర్తనల గ్రంథము 89:8
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

కీర్తనల గ్రంథము 89:6
మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

ద్వితీయోపదేశకాండమ 3:24
​ఆకాశమందే గాని భూమి యందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవు డెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవు డెవడు?

ద్వితీయోపదేశకాండమ 4:35
అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి యొకడు లేడనియు నీవు తెలిసికొనునట్లు అది నీకు చూపబడెను.

ద్వితీయోపదేశకాండమ 4:39
కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము

ద్వితీయోపదేశకాండమ 33:26
యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును.

సమూయేలు మొదటి గ్రంథము 2:2
యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడుమన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియు లేదు.

కీర్తనల గ్రంథము 44:1
దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి

కీర్తనల గ్రంథము 78:3
మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

కీర్తనల గ్రంథము 86:8
ప్రభువా, నీవు మహాత్మ్యముగలవాడవు ఆశ్చర్యకార్య ములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు.

నిర్గమకాండము 18:11
ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్య మునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.