Proverbs 9:1 in Telugu

Telugu Telugu Bible Proverbs Proverbs 9 Proverbs 9:1

Proverbs 9:1
జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది

Proverbs 9Proverbs 9:2

Proverbs 9:1 in Other Translations

King James Version (KJV)
Wisdom hath builded her house, she hath hewn out her seven pillars:

American Standard Version (ASV)
Wisdom hath builded her house; She hath hewn out her seven pillars:

Bible in Basic English (BBE)
Wisdom has made her house, putting up her seven pillars.

Darby English Bible (DBY)
Wisdom hath built her house, she hath hewn out her seven pillars;

World English Bible (WEB)
Wisdom has built her house. She has carved out her seven pillars.

Young's Literal Translation (YLT)
Wisdom hath builded her house, She hath hewn out her pillars -- seven.

Wisdom
חָ֭כְמוֹתḥākĕmôtHA-heh-mote
hath
builded
בָּנְתָ֣הbontâbone-TA
her
house,
בֵיתָ֑הּbêtāhvay-TA
out
hewn
hath
she
חָצְבָ֖הḥoṣbâhohts-VA
her
seven
עַמּוּדֶ֣יהָʿammûdêhāah-moo-DAY-ha
pillars:
שִׁבְעָֽה׃šibʿâsheev-AH

Cross Reference

ఎఫెసీయులకు 2:20
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.

గలతీయులకు 2:9
స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.

1 కొరింథీయులకు 3:9
మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.

మత్తయి సువార్త 16:18
మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

ప్రకటన గ్రంథము 3:12
జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.

1 పేతురు 2:5
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.

హెబ్రీయులకు 3:3
ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,

1 తిమోతికి 3:15
అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిర ములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రా¸

రాజులు మొదటి గ్రంథము 7:21
ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.

రాజులు మొదటి గ్రంథము 7:6
మరియు అతడు స్తంభ ములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటప మును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.

రాజులు మొదటి గ్రంథము 7:2
మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను