Job 42:6 in Telugu

Telugu Telugu Bible Job Job 42 Job 42:6

Job 42:6
కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.

Job 42:5Job 42Job 42:7

Job 42:6 in Other Translations

King James Version (KJV)
Wherefore I abhor myself, and repent in dust and ashes.

American Standard Version (ASV)
Wherefore I abhor `myself', And repent in dust and ashes.

Bible in Basic English (BBE)
For this cause I give witness that what I said is false, and in sorrow I take my seat in the dust.

Darby English Bible (DBY)
Wherefore I abhor [myself], and repent in dust and ashes.

Webster's Bible (WBT)
Wherefore I abhor myself, and repent in dust and ashes.

World English Bible (WEB)
Therefore I abhor myself, And repent in dust and ashes."

Young's Literal Translation (YLT)
Therefore do I loathe `it', And I have repented on dust and ashes.

Wherefore
עַלʿalal

כֵּ֭ןkēnkane
I
abhor
אֶמְאַ֣סʾemʾasem-AS
repent
and
myself,
וְנִחַ֑מְתִּיwĕniḥamtîveh-nee-HAHM-tee
in
עַלʿalal
dust
עָפָ֥רʿāpārah-FAHR
and
ashes.
וָאֵֽפֶר׃wāʾēperva-A-fer

Cross Reference

ఎజ్రా 9:6
నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.

దానియేలు 9:3
అంతట నేను గోనెపట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని.

యోబు గ్రంథము 40:3
అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చెను

యోబు గ్రంథము 30:19
ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.

యోబు గ్రంథము 2:8
అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

లూకా సువార్త 10:13
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణ ములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర

లూకా సువార్త 15:18
నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;

1 కొరింథీయులకు 15:8
అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

1 తిమోతికి 1:13
​నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

యాకోబు 4:7
కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.

మత్తయి సువార్త 11:21
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు

యోనా 3:6
ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.

ఎస్తేరు 4:1
జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి

యోబు గ్రంథము 9:31
నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.

కీర్తనల గ్రంథము 51:17
విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.

యెషయా గ్రంథము 5:5
ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

యెషయా గ్రంథము 58:5
అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలె తలవంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదె పరచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరను కొందురా?

యిర్మీయా 31:19
నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నొంది సిగ్గుపడితిని.

యెహెజ్కేలు 16:63
నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చి త్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 20:43
అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సు నకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు.

యెహెజ్కేలు 36:31
అప్పుడు మీరు మీ దుష్‌ ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియ లను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

రాజులు మొదటి గ్రంథము 21:27
​అహాబు ఆ మాటలు విని తన వస్త్ర ములను చింపు కొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి, గోనెపట్టమీద పరుండి వ్యాకులపడుచుండగా