Isaiah 45:15
ఇశ్రాయేలు దేవా, రక్షకా, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరచుకొను దేవుడవైయున్నావు.
Isaiah 45:15 in Other Translations
King James Version (KJV)
Verily thou art a God that hidest thyself, O God of Israel, the Saviour.
American Standard Version (ASV)
Verily thou art a God that hidest thyself, O God of Israel, the Saviour.
Bible in Basic English (BBE)
Truly, you have a secret God, the God of Israel is a Saviour!
Darby English Bible (DBY)
Verily thou art a ùGod that hidest thyself, O God of Israel, the Saviour. ...
World English Bible (WEB)
Most assuredly you are a God who hid yourself, God of Israel, the Savior.'
Young's Literal Translation (YLT)
Surely Thou `art' a God hiding Thyself, God of Israel -- Saviour!
| Verily | אָכֵ֕ן | ʾākēn | ah-HANE |
| thou | אַתָּ֖ה | ʾattâ | ah-TA |
| art a God | אֵ֣ל | ʾēl | ale |
| thyself, hidest that | מִסְתַּתֵּ֑ר | mistattēr | mees-ta-TARE |
| O God | אֱלֹהֵ֥י | ʾĕlōhê | ay-loh-HAY |
| of Israel, | יִשְׂרָאֵ֖ל | yiśrāʾēl | yees-ra-ALE |
| the Saviour. | מוֹשִֽׁיעַ׃ | môšîaʿ | moh-SHEE-ah |
Cross Reference
యెషయా గ్రంథము 57:17
వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
కీర్తనల గ్రంథము 44:24
నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
యెషయా గ్రంథము 43:3
యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.
యెషయా గ్రంథము 8:17
యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
2 పేతురు 3:18
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
రోమీయులకు 11:33
ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
అపొస్తలుల కార్యములు 13:23
అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టిం చెను.
అపొస్తలుల కార్యములు 5:31
ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.
యోహాను సువార్త 13:7
అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా
యోహాను సువార్త 4:42
మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
యోహాను సువార్త 4:22
మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.
మత్తయి సువార్త 1:22
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
యెషయా గ్రంథము 60:16
యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమముగల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.
యెషయా గ్రంథము 46:13
నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సీయోనులో రక్షణనుండ నియమించుచున్నాను ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించు చున్నాను.
యెషయా గ్రంథము 45:17
యెహోవావలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది యున్నది మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొంద కయు నుందురు.
యెషయా గ్రంథము 43:11
నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
యెషయా గ్రంథము 12:2
ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను
కీర్తనల గ్రంథము 77:19
నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
కీర్తనల గ్రంథము 68:26
సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి.