Hosea 9:12 in Telugu

Telugu Telugu Bible Hosea Hosea 9 Hosea 9:12

Hosea 9:12
వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థల ములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

Hosea 9:11Hosea 9Hosea 9:13

Hosea 9:12 in Other Translations

King James Version (KJV)
Though they bring up their children, yet will I bereave them, that there shall not be a man left: yea, woe also to them when I depart from them!

American Standard Version (ASV)
Though they bring up their children, yet will I bereave them, so that not a man shall be left: yea, woe also to them when I depart from them!

Bible in Basic English (BBE)
Even though their children have come to growth I will take them away, so that not a man will be there; for their evil-doing will be complete and they will be put to shame because of it.

Darby English Bible (DBY)
For even should they bring up their children, yet will I bereave them, [that] not a man [remain]: for woe also to them when I shall have departed from them!

World English Bible (WEB)
Though they bring up their children, Yet I will bereave them, so that not a man shall be left. Indeed, woe also to them when I depart from them!

Young's Literal Translation (YLT)
For though they nourish their sons, I have made them childless -- without man, Surely also, wo to them, when I turn aside from them.

Though
כִּ֤יkee

אִםʾimeem
they
bring
up
יְגַדְּלוּ֙yĕgaddĕlûyeh-ɡa-deh-LOO

אֶתʾetet
their
children,
בְּנֵיהֶ֔םbĕnêhembeh-nay-HEM
bereave
I
will
yet
וְשִׁכַּלְתִּ֖יםwĕšikkaltîmveh-shee-kahl-TEEM
man
a
be
not
shall
there
that
them,
מֵֽאָדָ֑םmēʾādāmmay-ah-DAHM
left:
yea,
כִּֽיkee
woe
גַםgamɡahm
also
א֥וֹיʾôyoy
to
them
when
I
depart
לָהֶ֖םlāhemla-HEM
from
them!
בְּשׂוּרִ֥יbĕśûrîbeh-soo-REE
מֵהֶֽם׃mēhemmay-HEM

Cross Reference

హొషేయ 7:13
వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ద ములు చెప్పుదురు

ద్వితీయోపదేశకాండమ 31:17
కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.

హొషేయ 9:16
ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

సమూయేలు మొదటి గ్రంథము 28:15
​సమూయేలునన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలునేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.

ద్వితీయోపదేశకాండమ 32:25
బయట ఖడ్గమును లోపట భయమును ¸°వనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు కలుగలవారిని నశింపజేయును.

హొషేయ 9:13
లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

హొషేయ 9:5
నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు?

విలాపవాక్యములు 2:20
నీవు ఎవనియెడల ఈ ప్రకారము చేసితివో యెహోవా, దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువుయొక్క పరి శుద్ధాలయమునందు హతులగుట తగువా?

యిర్మీయా 16:3
ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

యిర్మీయా 15:7
దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.

యోబు గ్రంథము 27:14
వారి పిల్లలు విస్తరించినయెడల అది ఖడ్గముచేత పడు టకే గదా వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు.

రాజులు రెండవ గ్రంథము 17:23
తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.

రాజులు రెండవ గ్రంథము 17:18
కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.

సమూయేలు మొదటి గ్రంథము 16:14
యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా

న్యాయాధిపతులు 4:16
​​బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు

ద్వితీయోపదేశకాండమ 28:41
​కుమా రులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్ట బడుదురు.

ద్వితీయోపదేశకాండమ 28:32
నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్య బడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచిచూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.

సంఖ్యాకాండము 26:65
ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.