Skip to content
CHRIST SONGS .IN
TAMIL CHRISTIAN SONGS .IN
  • Lyrics
  • Chords
  • Bible
  • /
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z

Index
  • A
  • B
  • C
  • D
  • E
  • F
  • G
  • H
  • I
  • J
  • K
  • L
  • M
  • N
  • O
  • P
  • Q
  • R
  • S
  • T
  • U
  • V
  • W
  • X
  • Y
  • Z
John 18 KJV ASV BBE DBY WBT WEB YLT

John 18 in Telugu WBT Compare Webster's Bible

John 18

1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడకెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.

2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.

3 కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధముల తోను అక్కడికివచ్చెను.

4 యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లిమీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.

5 వారునజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసుఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.

6 ఆయననేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.

7 మరల ఆయనమీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారునజరేయుడైన యేసునని చెప్పగా

8 యేసు వారితోనేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.

9 నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.

10 సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.

11 ఆ దాసునిపేరు మల్కు. యేసుకత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

12 అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.

13 అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.

14 కయపఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.

15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.

16 పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.

17 ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడుకాననెను.

18 అప్పుడు చలివేయు చున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలికాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.

19 ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా

20 యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయము లోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.

21 నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.

22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొఒకడుప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.

23 అందుకు యేసునేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావనెను.

24 అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.

25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచినీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడునేను కాను, నేనెరుగననెను.

26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడునునీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు

27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.

29 కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.

30 అందుకు వారువీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి.

31 పిలాతుమీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా

32 యూదులుఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధి కారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.

33 పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా

34 యేసునీ అంతట నీవే యీ మాట అను చున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను.

35 అందుకు పిలాతునేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా

36 యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.

37 అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసునీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం

38 అందుకు పిలాతుసత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;

39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.

40 అయితే వారువీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

  • Tamil
  • Hindi
  • Malayalam
  • Telugu
  • Kannada
  • Gujarati
  • Punjabi
  • Bengali
  • Oriya
  • Nepali

By continuing to browse the site, you are agreeing to our use of cookies.

Close