Psalm 144:4
నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.
Psalm 144:4 in Other Translations
King James Version (KJV)
Man is like to vanity: his days are as a shadow that passeth away.
American Standard Version (ASV)
Man is like to vanity: His days are as a shadow that passeth away.
Bible in Basic English (BBE)
Man is like a breath: his life is like a shade which is quickly gone.
Darby English Bible (DBY)
Man is like to vanity; his days are as a shadow that passeth away.
World English Bible (WEB)
Man is like a breath. His days are like a shadow that passes away.
Young's Literal Translation (YLT)
Man to vanity hath been like, His days `are' as a shadow passing by.
| Man | אָ֭דָם | ʾādom | AH-dome |
| is like | לַהֶ֣בֶל | lahebel | la-HEH-vel |
| to vanity: | דָּמָ֑ה | dāmâ | da-MA |
| his days | יָ֝מָ֗יו | yāmāyw | YA-MAV |
| shadow a as are | כְּצֵ֣ל | kĕṣēl | keh-TSALE |
| that passeth away. | עוֹבֵֽר׃ | ʿôbēr | oh-VARE |
Cross Reference
Psalm 102:11
నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
Psalm 109:23
సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
Job 8:9
మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.
Ecclesiastes 12:8
సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్వర్థము.
Ecclesiastes 8:13
భక్తిహీనులు దేవుని సన్నిధిని భయ పడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగు దును.
Ecclesiastes 1:14
సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.
Ecclesiastes 1:2
వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.
Psalm 103:15
నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.
Psalm 89:47
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?
Psalm 62:9
అల్పులైనవారు వట్టి ఊపిరియై యున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు
Psalm 39:11
దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడ గొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)
Psalm 39:5
నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు.(సెలా.)
Job 14:1
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.
Job 4:19
జిగటమంటి యిండ్లలో నివసించువారియందుమంటిలో పుట్టినవారియందుచిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
1 Chronicles 29:15
మా పితరులందరివలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై యున్నాము, మా భూనివాసకాలము నీడ యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు
2 Samuel 14:14
మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.