యోబు గ్రంథము 19:7 in Telugu

తెలుగు తెలుగు బైబిల్ యోబు గ్రంథము యోబు గ్రంథము 19 యోబు గ్రంథము 19:7

Job 19:7
నామీద బలాత్కారము జరుగుచున్నదని నేనుమొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదుసహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

Job 19:6Job 19Job 19:8

Job 19:7 in Other Translations

King James Version (KJV)
Behold, I cry out of wrong, but I am not heard: I cry aloud, but there is no judgment.

American Standard Version (ASV)
Behold, I cry out of wrong, but I am not heard: I cry for help, but there is no justice.

Bible in Basic English (BBE)
Truly, I make an outcry against the violent man, but there is no answer: I give a cry for help, but no one takes up my cause.

Darby English Bible (DBY)
Behold, I cry out of wrong, and I am not heard; I cry aloud, but there is no judgment.

Webster's Bible (WBT)
Behold, I cry out of wrong, but I am not heard: I cry aloud, but there is no judgment.

World English Bible (WEB)
"Behold, I cry out of wrong, but I am not heard: I cry for help, but there is no justice.

Young's Literal Translation (YLT)
Lo, I cry out -- violence, and am not answered, I cry aloud, and there is no judgment.

Behold,
הֵ֤ןhēnhane
I
cry
out
אֶצְעַ֣קʾeṣʿaqets-AK
of
wrong,
חָ֭מָסḥāmosHA-mose
not
am
I
but
וְלֹ֣אwĕlōʾveh-LOH
heard:
אֵעָנֶ֑הʾēʿāneay-ah-NEH
aloud,
cry
I
אֲ֝שַׁוַּ֗עʾăšawwaʿUH-sha-WA
but
there
is
no
וְאֵ֣יןwĕʾênveh-ANE
judgment.
מִשְׁפָּֽט׃mišpāṭmeesh-PAHT

Cross Reference

హబక్కూకు 1:2
యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.

విలాపవాక్యములు 3:8
నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.

యోబు గ్రంథము 30:20
నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తర మేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.

యిర్మీయా 20:8
​​ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలా త్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతు వాయెను.

కీర్తనల గ్రంథము 22:2
నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

యోబు గ్రంథము 40:8
నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అప రాధము మోపుదువా?

యోబు గ్రంథము 34:5
నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను

యోబు గ్రంథము 31:35
నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

యోబు గ్రంథము 23:3
ఆయన నివాసస్థానమునొద్ద నేను చేరునట్లుగాఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక.

యోబు గ్రంథము 21:27
మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.

యోబు గ్రంథము 16:21
నర పుత్రునివిషయమై వాని స్నేహితునితో వ్యాజ్యెమాడవలెననియు కోరినేను దేవునితట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను.

యోబు గ్రంథము 16:17
ఏడ్పుచేత నా ముఖము ఎఱ్ఱబడియున్నదినా కనురెప్పలమీద మరణాంధకారము నిలుచుచున్నది.

యోబు గ్రంథము 13:15
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.

యోబు గ్రంథము 10:15
నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగునునేను నిర్దోషినై యుండినను అతిశయపడను అవమానముతో నిండుకొనినాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

యోబు గ్రంథము 10:3
దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయా దృష్టియుంచుటసంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా?

యోబు గ్రంథము 9:32
ఆయన నావలె నరుడు కాడునేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుమేము కలిసి న్యాయవిమర్శకు పోలేము.

యోబు గ్రంథము 9:24
భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నదివారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడు?