Psalm 87:3
దేవుని పట్టణమా, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు.(సెలా.)
Psalm 87:3 in Other Translations
King James Version (KJV)
Glorious things are spoken of thee, O city of God. Selah.
American Standard Version (ASV)
Glorious things are spoken of thee, O city of God. Selah
Bible in Basic English (BBE)
Noble things are said of you, O town of God. (Selah.)
Darby English Bible (DBY)
Glorious things are spoken of thee, O city of God. Selah.
Webster's Bible (WBT)
Glorious things are spoken of thee, O city of God. Selah.
World English Bible (WEB)
Glorious things are spoken about you, city of God. Selah.
Young's Literal Translation (YLT)
Honourable things are spoken in Thee, O city of God. Selah.
| Glorious things | נִ֭כְבָּדוֹת | nikbādôt | NEEK-ba-dote |
| are spoken | מְדֻבָּ֣ר | mĕdubbār | meh-doo-BAHR |
| city O thee, of | בָּ֑ךְ | bāk | bahk |
| of God. | עִ֖יר | ʿîr | eer |
| Selah. | הָאֱלֹהִ֣ים | hāʾĕlōhîm | ha-ay-loh-HEEM |
| סֶֽלָה׃ | selâ | SEH-la |
Cross Reference
ప్రకటన గ్రంథము 21:10
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.
ప్రకటన గ్రంథము 14:1
మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి.
హెబ్రీయులకు 12:22
ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
యెహెజ్కేలు 37:27
నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.
యెహెజ్కేలు 36:11
మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
కీర్తనల గ్రంథము 46:4
ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.
యిర్మీయా 31:12
వారు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు; యెహోవా చేయు ఉప కారమునుబట్టియు గోధుమలనుబట్టియు ద్రాక్షారసమును బట్టియు తైలమునుబట్టియు, గొఱ్ఱలకును పశువులకును పుట్టు పిల్లలనుబట్టియు సమూహములుగా వచ్చెదరు; వారిక నెన్నటికిని కృశింపక నీళ్లుపారు తోటవలె నుందురు.
యిర్మీయా 3:14
భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
యెషయా గ్రంథము 61:3
సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.
యెషయా గ్రంథము 59:20
సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.
యెషయా గ్రంథము 54:2
నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము.
యెషయా గ్రంథము 49:14
అయితే సీయోనుయెహోవా నన్ను విడిచిపెట్టి యున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది.
యెషయా గ్రంథము 12:6
సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
కీర్తనల గ్రంథము 125:1
యెహోవాయందు నమి్మక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
కీర్తనల గ్రంథము 48:11
నీ న్యాయవిధులనుబట్టి సీయోను పర్వతము సంతోషించును గాక యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక.
కీర్తనల గ్రంథము 48:2
ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వ తము రమ్యమైన యెత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది
యెహెజ్కేలు 48:1
గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము .. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరే నాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
యెహెజ్కేలు 40:1
మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్స... రము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.
యెహెజ్కేలు 36:2
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆహా ప్రాచీనము లైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.