Psalm 111:1
యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
Psalm 111:1 in Other Translations
King James Version (KJV)
Praise ye the LORD. I will praise the LORD with my whole heart, in the assembly of the upright, and in the congregation.
American Standard Version (ASV)
Praise ye Jehovah. I will give thanks unto Jehovah with my whole heart, In the council of the upright, and in the congregation.
Bible in Basic English (BBE)
Let the Lord be praised. I will give praise to the Lord with all my heart, among the upright, and in the meeting of the people.
Darby English Bible (DBY)
Hallelujah! I will celebrate Jehovah with [my] whole heart, in the council of the upright, and in the assembly.
World English Bible (WEB)
Praise Yah! I will give thanks to Yahweh with my whole heart, In the council of the upright, and in the congregation.
Young's Literal Translation (YLT)
Praise ye Jah! I thank Jehovah with the whole heart, In the secret meeting of the upright, And of the company.
| Praise | הַ֥לְלוּ | hallû | HAHL-loo |
| ye the Lord. | יָ֨הּ׀ | yāh | ya |
| praise will I | אוֹדֶ֣ה | ʾôde | oh-DEH |
| the Lord | יְ֭הוָה | yĕhwâ | YEH-va |
| whole my with | בְּכָל | bĕkāl | beh-HAHL |
| heart, | לֵבָ֑ב | lēbāb | lay-VAHV |
| in the assembly | בְּס֖וֹד | bĕsôd | beh-SODE |
| upright, the of | יְשָׁרִ֣ים | yĕšārîm | yeh-sha-REEM |
| and in the congregation. | וְעֵדָֽה׃ | wĕʿēdâ | veh-ay-DA |
Cross Reference
కీర్తనల గ్రంథము 138:1
నేను నా పూర్ణహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల యెదుట నిన్ను కీర్తించెదను.
కీర్తనల గ్రంథము 149:1
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29:10
రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెనుమాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు.
కీర్తనల గ్రంథము 89:7
పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.
కీర్తనల గ్రంథము 35:18
అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.
కీర్తనల గ్రంథము 109:30
నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.
కీర్తనల గ్రంథము 108:3
జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
కీర్తనల గ్రంథము 107:32
జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
కీర్తనల గ్రంథము 106:48
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.
కీర్తనల గ్రంథము 106:1
యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
కీర్తనల గ్రంథము 103:1
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
కీర్తనల గ్రంథము 89:5
యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.
కీర్తనల గ్రంథము 40:9
నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
కీర్తనల గ్రంథము 22:25
మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దనుఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.
కీర్తనల గ్రంథము 9:1
నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదనుయెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 20:26
నాల్గవ దినమున వారు బెరాకా1 లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా1 లోయ యని పేరు.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 6:3
రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.